‘ ర‌ణ‌రంగం ‘ ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్స్‌… ఇలా చేశావేంటి శ‌ర్వా

August 16, 2019 at 11:12 am

యంగ్ హీరో శ‌ర్వానంద్ న‌టించిన ర‌ణ‌రంగం సినిమా స్వాతంత్య్ర దినోత్స‌వం కానుక‌గా గురువారం ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. సుధీర్‌వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమా మ‌రో యంగ్ హీరో అడ‌వి శేష్ న‌టించిన ఎవ‌రు సినిమాకు పోటీగా బాక్సాఫీస్ ర‌ణ‌రంగంలోకి దిగింది.

శ‌ర్వానంద్ స‌ర‌స‌న కాజ‌ల్ అగ‌ర్వాల్‌, క‌ళ్యాణి ప్రియ‌ద‌ర్శ‌ని జంట‌గా న‌టించిన ఈ సినిమాకు టేకింగ్ ప‌రంగా ప్ర‌శంస‌లు వ‌చ్చాయి. అదే టైంలో హీరో శ‌ర్వానంద్ ఎఫ‌ర్ట్‌కు కూడా అంద‌రూ మంచి మార్కులే వేశారు. క‌థ‌, క‌థ‌నాల ప‌రంగా సుధీర్‌వ‌ర్మ కాస్త త‌డ‌బ‌డిన‌ట్టు తేలింది. ఇక సినిమాకు ప్ర‌మోష‌న్లు, సోష‌ల్ మీడియా హంగామా కూడా లేక‌పోవ‌డం కూడా మైన‌స్ అయ్యింది.

ఇక తొలి రోజు ర‌ణ‌రంగం రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ 3.8 కోట్ల షేర్ రాబ‌ట్టింది. ఈ సినిమాకు రూ.16 కోట్ల థియేట్రిక‌ల్ బిజినెస్ జ‌రిగింది. మ‌రి తొలి రోజు ఓ మోస్త‌రు టాక్‌తో ఈ వ‌సూళ్లు రాబ‌ట్ట‌డం శ‌ర్వా రేంజ్‌కు కాస్త త‌క్కువే అని చెప్పుకోవాలి. శ‌ర్వానంద్ కెరీర్‌లోనే ఫ‌స్ట్ టైం గ్యాంగ్‌స్ట‌ర్‌గా న‌టించాడు.

శుక్ర‌వారం నుంచి ఎవ‌రుతో పోటీ త‌ట్టుకుని ర‌ణ‌రంగం ఎలాంటి వ‌సూళ్లు రాబ‌డుతుందో ? ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద సేఫ్ అవుతుందో ? లేదో ? తెలియాలంటే ఫ‌స్ట్ వీకెండ్ వ‌ర‌కు ఆగాల్సిందే.

‘ ర‌ణ‌రంగం ‘ ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్స్‌… ఇలా చేశావేంటి శ‌ర్వా
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share