ర‌ణ‌రంగం ఫ్రీ రిలీజ్ బిజినెస్ ఎంతో తెలుసా….!!

August 14, 2019 at 3:00 pm

యువ హీరో శ‌ర్వానంద్ న‌టించిన చిత్రం ర‌ణ‌రంగం ఈనెల15న విడుదల కానున్న‌ది. అయితే ఈ సినిమా ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల కానున్న నేప‌థ్యంలో ఫ్రీ రిలీజ్ బిజినెస్ ఎంత అయిందో అనే ఆస‌క్తి శ‌ర్వానంద్ అభిమానుల్లో నెల‌కొంది. ఇప్ప‌టికే ఈసినిమాకు సంబంధించిన టీజ‌ర్‌, ట్రైల‌ర్‌, ఫ‌స్ట్ లుక్‌లు విడుద‌ల అయి అభిమానుల్లో భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి.

శ‌ర్వానంద్ ఈసినిమాతో హిట్ కొడుతాడ‌నే అంచనాలు నెల‌కొన్నాయి. సినిమా ట్రైల‌ర్ చూస్తే సినిమాపై భారీ హైప్ క్రియోట్ అయింది. సినిమా విడుద‌ల‌కు ముందు జ‌రిగే ఫ్రీ రిలీజ్ బిజినెస్ భారీగానే చేసింద‌నే టాక్ వినిపిస్తున్న‌ది. శ‌ర్వానంద్ ఓ గ్యాంగ్‌స్ట‌ర్‌గా న‌టిస్తున్న ఈ చిత్రంపై బ‌య్య‌ర్లు భారీగానే పెట్టుబ‌డి పెట్టి కొనుగోలు చేసిన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతుంది. ఇంత‌కు ఈ సినిమా ఫ్రీ రిలీజ్ బిజినెస్ ఎంత అయిందంటే…

ర‌ణ‌రంగం చిత్రం రూ.16కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. నైజాం, ఏపీ కలుపుకుని రూ.13కోట్ల బిజినేస్ చేసింద‌ట‌. నైజాంలో రూ.5కోట్లు, ఓవ‌ర్సీస్‌లో రూ.1.80కోట్లు, క‌ర్నాట‌క రూ.90లక్ష‌లు, సీడెడ్‌లో రూ.2కోట్లు, నెల్లూరులో రూ.50ల‌క్ష‌లు, కృష్ణ‌, గుంటూరు జిల్లాల్లో రూ.2.20కోట్లు, ఉభ‌య గోదావ‌రి జిల్లాల్లో రూ.1.80కోట్లు, వైజాగ్‌లో రూ.1.50కోట్లు, రెస్టాఫ్ ఇండియాలో రూ.30ల‌క్ష‌లు చొప్పున బిజినెస్ చేసింద‌ట‌. సో ఈ సినిమా ఇప్ప‌టికే రూ. 16కోట్ల ఫ్రీ బిజినెస్ చేసిందంటే సినిమా ఎంత‌మేర‌కు వ‌సూలు చేస్తుందో చూడాలి.

ర‌ణ‌రంగం ఫ్రీ రిలీజ్ బిజినెస్ ఎంతో తెలుసా….!!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share