” రారండోయ్ వేడుక చూద్దాం ” 2 డేస్ టోట‌ల్ క‌లెక్ష‌న్స్‌

అక్కినేని నాగ‌చైత‌న్య – టాలీవుడ్ గోల్డెన్‌గ‌ర్ల్ ర‌కుల్‌ప్రీత్‌సింగ్ జంట‌గా న‌టించిన రారండోయ్ వేడుక చూద్దాం సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద మంచి ప్రారంభ వ‌సూళ్లు సాధిస్తోంది. సోగ్గాడే చిన్ని నాయ‌నా ఫేం కుర‌సాల క‌ళ్యాణ్‌కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ సినిమాకు ముందు నుంచి పాజిటివ్ బ‌జ్ ఉండడం, స‌మ్మ‌ర్ సెల‌వులు కావ‌డంతో బాగా క‌లిసొచ్చింది.

దీంతో ఈ సినిమాకు ఏపీ, తెలంగాణ‌లో తొలి రెండు రోజుల‌కు క‌లిపి రూ 5.9 కోట్ల వ‌సూళ్లు రాబ‌ట్టింది. ఈ వ‌సూళ్లు నాగ‌చైత‌న్య కెరీర్‌లోనే టాప్‌. ఏపీ, తెలంగాణ‌లో రారండోయ్ వేడుక చూద్దాం రెండు రోజుల వ‌సూళ్లు ఇలా ఉన్నాయి.

నైజాం – 1.96 కోట్లు

సీడెడ్ – 92 ల‌క్ష‌లు

నెల్లూరు – 17 ల‌క్ష‌లు

గుంటూరు – 57 ల‌క్ష‌లు

కృష్ణా – 50 ల‌క్ష‌లు

వెస్ట్ – 41 ల‌క్ష‌లు

ఈస్ట్ – 53 ల‌క్ష‌లు

ఉత్త‌రాంధ్ర – 93 ల‌క్ష‌లు

————————————————

టోట‌ల్ 2 డేస్ క‌లెక్ష‌న్స్ = రూ 5.9 కోట్లు

————————————————-