మాస్ రాజా త్యాగం..శర్వానంద్ కి వరం ..!

August 13, 2019 at 4:22 pm

పాపం మాస్ మ‌హారాజాకు ఇప్పుడు స‌రైన హిట్లు లేక‌పోవ‌డంతో హిట్ కోసం ఆరాట‌ప‌డుతున్నాడు.. అయితే హిట్ దొరికింద‌నుకునే స‌రికి దాన్ని గ‌ద్ద‌లా వ‌చ్చి ఓ యువ హీరో త‌న్నుకుపోయాడు.. త‌న్నుకుపోయాడ‌నే కంటే మ‌హారాజా త్యాగం చేశాడంటే బాగుంటుంది… పేరులోనే ఉన్న‌ట్లు మాస్ మ‌హారాజా… మ‌హారాజా బిరుదుకు త‌గ్గ‌ట్లు ఈ ఓ సినిమాను ఓ యువ హీరోకు దానం చేశాడు.. ఇప్పుడు మాస్‌మ‌హారాజా చేసిన దానం ఓ హీరోకు ఓ బిగ్గెస్ట్ హిట్ కాబోతున్న‌ట్లు స‌మ‌చారం.

ఇంత‌కు మ‌హారాజా నుంచి దానం పొందిన హీరో ఎవ‌రు అనుకుంటున్నారు.. అదేనండి యువ హీరో శ‌ర్వానంద్‌. శ‌ర్వానంద్ హీరోగా, కాజ‌ల్ అగ‌ర్వాల్‌, క‌ళ్యాణీ ప్రియ‌ద‌ర్శ‌న్ కాంబినేష‌న్‌లో సుధీర్‌వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో ఈనెల 15న రాబోతున్న చిత్రం ర‌ణ‌రంగం. ఈ సినిమాను ద‌ర్శ‌కుడు సుధీర్‌వ‌ర్మ ముందుగా మాస్ మ‌హారాజా ర‌వితేజ‌కు వినిపించాడు. అత‌ను ఓకే చేశాడు.. కానీ ఇదే క‌థ‌ను తెలుసుకున్న శ‌ర్వానంద్ ర‌వితేజ‌ను క‌లిసి త‌న‌కు ఆ సినిమా ఇవ్వాల‌ని కోరాడ‌ట‌.. దీంతో ర‌వితేజ ఆ సినిమాను శ‌ర్వానంద్‌కు వ‌దిలేసాడ‌ట‌.

ర‌ణ‌రంగం సినిమాను ర‌వితేజ శ‌ర్వానంద్‌కు వ‌దిలేయ‌డం, ర‌ణ‌రంగంను సుధీర్‌వ‌ర్మ అద్భుతంగా తెర‌కెక్కించ‌డం జ‌రిగింది. ఈ సినిమా ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మం చూస్తే శ‌ర్వానంద్ కేరీర్ బిగ్గేస్ట్ హిట్ అయ్యే అవ‌కాశాలు పుష్క‌లంగా ఉన్నాయి. దీంతో శ‌ర్వానంద్ ఆనందంతో త‌బ్బిబ్బ‌వుతుంటే… ఓ మంచి హిట్ చిత్రాన్ని దానం చేసిన ర‌వితేజ పాపం ఓ హిట్ కోసం ఎదురు చూస్తున్నాడు… ర‌వితేజ‌కు రాజా ది గ్రేట్ చిత్రం త‌రువాత హిట్ చిత్రాలు లేవు… సో ర‌ణ‌రంగం ఒక‌రికి తీపీ, ఒక‌రికి చేదును మిగిల్చింద‌న్న‌మాట‌.

మాస్ రాజా త్యాగం..శర్వానంద్ కి వరం ..!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share