రవిబాబు హ‌ర్ర‌ర్ థ్రిల్లింగ్ ‘ఆవిరి’ ట్రైలర్ …!

October 10, 2019 at 6:38 pm

ద‌ర్శ‌కుడు, హీరో ర‌విబాబు తెర‌కెక్కించిన చిత్రం ఆవిరి. ఈచిత్రం ట్రైల‌ర్‌ను కొద్ది సేప‌టి క్రితం చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. ఇప్పుడు ఈ ఆవిరి చిత్రం ట్రైల‌ర్ నెట్టింట్లో హ‌ల్ ఛ‌ల్ చేస్తోంది. 2.15నిమిషాల నిడివి గ‌ల ట్రైల‌ర్ ఓ క్రైం హ‌ర్ర‌ర్ థ్రిల్ల‌ర్ సినిమాగా ఉంది. అల్ల‌రి, న‌చ్చావులే, అన‌సూయ‌, అవును, అవును 2 వంటి ప‌లు చిత్రాల ద్వారా త‌న‌దైన మార్కుతో ద‌ర్శ‌కుడిగా ర‌విబాబు త‌న‌కంటూ ఓ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్నారు . ఫ్లైయింగ్ ప్రాగ్స్ చిత్రాన్ని నిర్మిస్తుంది. స‌క్సెస్ ఫుల్ చిత్రాల నిర్మాత దిల్ రాజు త‌న సొంత బేన‌ర్ శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బేన‌ర్ మీదుగా చిత్రాన్ని విడుద‌ల చేస్తున్నారు.

సాధార‌ణంగా ర‌విబాబు ఎక్కువ‌గా హ‌ర్ర‌ర్ సినిమాల‌కే ప్రాధాన్య‌త ఇస్తుంటారు. ర‌విబాబు సినిమా అంటే ఏదో స్పెషల్ ఉంటుందని ఆడియెన్స్ ఎగ్జైటింగ్‌గా వెయిట్ చేస్తుంటారు. ఆయ‌న ఇటీవలే పందిపిల్ల ప్ర‌ధాన పాత్ర‌లో అదుగో అనే సినిమాని రూపొందించాడు. ఈ సినిమా అనుకున్నంత ఆద‌ర‌ణ పొంద‌లేదు. తాజాగా ఆవిరి అనే సినిమా తెర‌కెక్కిస్తున్నాడు ఈ టాలెంటెడ్ డైరెక్టర్ . ఇందులో ర‌విబాబు, నేహా చౌహ‌న్, శ్రీముక్త‌, భ‌ర‌ణి శంక‌ర్, ముక్త‌ర్ ఖాన్ న‌టిస్తున్నారు.

ఆవిరి ట్రైల‌ర్ లో త‌న కూతురు మిస్ అవడం, ఆమెని ఆత్మ తీసుకెళ్ళి పోతుంది. అయితే దొర‌క‌డం, మ‌ళ్ళీ మాయం కావ‌డం, ఆమెని కనిపెట్టడానికి వచ్చిన వాళ్లు ప్రమాదాలకు గురి కావడం, ఇలా ఉత్కంఠతగా ట్రైల‌ర్‌ను ద‌ర్శ‌కుడు ర‌విబాబు క‌ట్ చేశారు. ఫస్ట్‌లుక్‌‌తోనే ఆడియన్స్‌ని ఇంప్రెస్ చేసిన రవిబాబు టీజర్, ట్రైలర్‌తో సినిమాపై అంచనాలు పెంచాడు. ఈ సినిమాలో ఆవిరికి, ఇంట్లో ఉన్న ఆత్మకు ఉన్న సంబంధం ఏమిటో తెలియాలంటే రిలీజ్ డేట్ అయిన నవంబర్ 1 వ‌ర‌కు ఉత్కంఠ‌తో ఎదురు చూడాల్సిందే..

రవిబాబు హ‌ర్ర‌ర్ థ్రిల్లింగ్ ‘ఆవిరి’ ట్రైలర్ …!
0 votes, 0.00 avg. rating (0% score)

comments



Related Posts


Share
Share