” స్పైడ‌ర్ ” రెండు సార్లు ఎందుకు?

July 10, 2017 at 4:38 am

సూప‌ర్‌స్టార్ మహేష్ బాబు స్పైడర్ సినిమా గురించి ఇక పూర్తి క్లారిటీ రావడం లేదు. సెప్టెంబర్ 27 రిలీజ్ అంటున్నా ఇంకా ఆ దిశ‌గా ఇంకా అడుగులు ప‌డుతున్న‌ట్టు లేదు. ప్ర‌స్తుతం ఉన్న రెండు పాట‌ల బ్యాలెన్స్‌లో ఫ‌స్ట్ పాట షూట్ చేస్తున్నార‌ని అంటున్నారు.

స్పైడ‌ర్ షూటింగ్ ఇంత డిలే ఎందుకు జరుగుతోంది అనే దాని గురించి ప్రిన్స్ ఫాన్స్ తెగ ఆందోళనలో ఉన్నారు. ఇప్పటికే జై లవకుశ, పైసా వసూల్ సినిమాలు సెప్టెంబర్ నెలలో కర్చీఫ్ వేయగా స్పైడర్ రిలీజ్ డేట్ విష‌యంలో బ‌య్య‌ర్లు, డిస్ట్రిబ్యూట‌ర్ల‌కు ఇంకా క్లారిటీ లేక‌పోవడం అంద‌రికి ఇబ్బందిగానే ఉంది.

రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేస్తే గాని డిస్ట్రిబ్యూట‌ర్లు దానికి అనుగుణంగా థియేట‌ర్లు రెడీ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విష‌యంలో వీరు ఎంత ఒత్తిడి చేస్తున్నా నిర్మాత‌లు, మ‌హేష్‌, మురుగ‌దాస్ నుంచి ఎవ్వ‌రూ క్లారిటీ ఇవ్వ‌డం లేదు.

ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్ సైలెంట్ గా రిలీజ్ చేశారు.

ఇక సినిమాలో చాలా సీన్ల‌కు భారీ ప్యాచ్ వ‌ర్క్ జ‌రుగుతోన్న‌ట్టు ఇండ‌స్ట్రీలో ఇన్న‌ర్ టాక్ న‌డుస్తోంది. ఇక చాలా సీన్ల‌ను రెండుసార్లు షూట్ చేస్తున్నార‌ట‌. మురుగ‌దాస్ చిన్న సీన్ విష‌యంలో కూడా రాజీప‌డ‌డం లేద‌ట‌. అందుకే రెండు భాష‌ల్లోను లింప్ సింక్ అయ్యేలా ప్ర‌తి సీన్ రెండుసార్లు షూట్ చేస్తున్నార‌ని తెలుస్తోంది.

ఇక స్పైడ‌ర్‌కు దాస్ టేకింగ్, మహేష్ యాక్టింగ్, హరీష్ జైరాజ్ రీ రికార్డింగ్ మేజర్ హై లైట్స్ గా చెబుతున్న ఈ మూవీ లో దర్శకుడు ఎస్ జె సూర్య విలన్‌గా న‌టిస్తున్నారు. సినిమాలో ఎన్ని హైలెట్లు ఉన్నా రిలీజ్ డేట్‌పై పూర్తి క్లారిటీ వ‌స్తే గాని స్పైడ‌ర్ ఫ్యాన్స్‌లో జోష్ ఉండేలా లేదు.

 

” స్పైడ‌ర్ ” రెండు సార్లు ఎందుకు?
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share