R R R హీరోయిన్ కంట క‌న్నీళ్లు ఆగ‌లేదు…

December 3, 2019 at 11:41 am

ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు మహేష్ భట్ కూతురిగా సినిమా రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది అలియా భ‌ట్‌. చాలా త‌క్కువ టైంలోనే బాలీవుడ్‌లో పాపుల‌ర్ హీరోయిన్ అయ్యింది. ప్ర‌స్తుతం ఇండ‌స్ట్రీలో స్టార్ హీరోయిన్ స్టేట‌స్ ఎంజాయ్ చేస్తోన్న అలియా ఇటు తెలుగు ఇండ‌స్ట్రీలోకి కూడా ఎంట్రీ ఇస్తోంది. ప్ర‌స్తుతం ఆమె ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి డైరెక్ట్ చేస్తోన్న ఆర్ ఆర్ ఆర్ సినిమాలో మెగాప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ స‌ర‌స‌న హీరోయిన్‌గా న‌టిస్తోంది.

ఈ సినిమాలో రామ్‌చ‌ర‌ణ్ విప్ల‌వ వీరుడు అల్లూరి సీతారామ‌రాజు క్యారెక్ట‌ర్‌లో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈ పాత్ర ప‌క్క అలియా న‌టిస్తోంది. అలాగే హిందీలో తెర‌కెక్కే మ‌రో భారీ బ‌డ్జెట్ సినిమా బ్ర‌హ్మాస్త్ర‌లోనూ హీరోయిన్‌గా చేస్తోంది. ఇదిలా ఉంటే అలియా ఒక కార్యక్రమంలో తన చెల్లెలు షహీన్ గురించి తలచుకొని కన్నీటి పర్యంతరమైంది. అలియా చెల్లెలు ష‌హీన్ రాసిన పుస్త‌కం చ‌దివిన ఆమె తీవ్ర భావోద్వేగానికి గురైంది.

అలియా చెల్లులు ష‌హీన్‌ 13ఏళ్ల వయసు నుండి చాలా కాలం డిప్రెషన్ లోకి వెళ్లిపోయింద‌ట‌. అయితే ఈ విష‌యం అలియాకు ఇప్ప‌టి వ‌ర‌కు తెలియ‌ద‌ట‌. షహీన్ రాసిన ‘ఐ హావ్ బీన్ నెవర్ అన్ హ్యాపీయర్’ అనే బుక్ చదివే వరకు ఆమె డిప్రెష‌న్లోకి వెళ్లిన విష‌యం త‌న‌కు తెలియ‌ద‌ని.. ఆమె వేదిక మీదే క‌న్నీళ్లు పెట్టుకున్నారు. త‌న చెల్లి ఇలాంటి ప‌రిస్థితి ఎదుర్కొన్నా తాను తెలుసు కోలేక‌పోయానంటూ ఆమె తీవ్ర ఉద్వేగానికి గురైంది.

R R R హీరోయిన్ కంట క‌న్నీళ్లు ఆగ‌లేదు…
0 votes, 0.00 avg. rating (0% score)

comments



Related Posts


Share
Share