#RRR రిలీజ్ డేట్ చేంజ్…!

October 22, 2019 at 11:22 am

న‌వంబ‌ర్ 11, 2018న షూటింగ్ ప్రారంభించుకున్న ఆర్ ఆర్ ఆర్ మూవీ పోస్టుపోన్‌ల‌తోనే కాలం స‌గం గ‌డిచిపోయింది. సినిమాను జూన్ 30, 2020న విడుద‌ల చేస్తున్న‌ట్లు ప్ర‌చారం చేసింది చిత్ర యూనిట్ కానీ అనుకోని కార‌ణాల‌తో 2020 నుంచి 2021కి మార్చుకునే అవ‌కాశం ఉంద‌ని ప్ర‌చారం జ‌రుగుతుంది. మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌, యంగ్ టైగ‌ర్ జూనియ‌ర్ ఎన్టీఆర్ లు గాయాల కారణంగా సినిమా షూటింగ్‌ల‌కు ఆల‌స్యం కావ‌డం, రామ్‌చ‌ర‌ణ్ సైరా చిత్ర ప్ర‌మోష‌న్ లో పాల్గొన‌డం వంటివి ఉన్నాయి.

వీటికి తోడు రామ్ చ‌ర‌ణ్ స‌ర‌స‌న న‌టించే బాలీవుడ్ హీరోయిన్ ఆలీయాభ‌ట్ డేట్స్ అడ్జ‌ట్స్ కాక‌పోవ‌డం, బాలీవుడ్ హీరో అజ‌య్‌దేవ్‌గ‌ణ్ కూడా కొంత స‌మ‌యం తీసుకోవ‌డంతో పాటుగా, ప‌లు కార‌ణల‌తో సినిమా షూటింగ్‌లో భారీ జాప్యం జ‌రుగింద‌ని, అందుకే సినిమా విడుద‌ల‌, ట్రైల‌ర్‌, టీజ‌ర్ పోస్టుపోన్ చేసుకుంటున్న‌ట్లు ఓ క‌థ‌నం వెలువ‌డింది.

డివివి ఎంట‌ర్‌టైన్‌మెంట్ ప‌తాకంపై డివివి దాన‌య్య ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా రూ.300కోట్ల భారీ బ‌డ్జెట్‌తో ద‌ర్శ‌క‌ధీరుగు ఎస్ ఎస్ రాజ‌మౌళీ తెర‌కెక్కిస్తున్నారు. మ‌రో బాహుబ‌లి సినిమా రేంజ్‌లో ఆర్ ఆర్ ఆర్ సినిమాను జ‌క్క‌న్న చెక్కుతున్నాడు. ప్ర‌స్తుతం హైద‌రాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్ట‌రీలో సినిమాకు సంబంధించిన షూటింగ్ జ‌రుపుకుంటుంది. ఆర్ ఆర్ ఆర్ మూవీ యూనిట్ అధికారిక ప్ర‌క‌ట‌న చేస్తే త‌ప్ప దీనిపై క్లారిటీ వ‌చ్చే అవ‌కాశం లేదు.

#RRR రిలీజ్ డేట్ చేంజ్…!
0 votes, 0.00 avg. rating (0% score)

comments



Related Posts


Share
Share