హిందిలో సాహోకు డ‌బ్బింగ్ ఎవ‌రో తెలుసా…!

August 13, 2019 at 5:29 pm

యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ న‌టిస్తున్న సాహో చిత్రానికి హిందిలో ఎవ‌రు డ‌బ్బింగ్ చెబుతున్నారో తెలుసా…? ఎందుకు అనుమానం ప్ర‌భాసే త‌న పాత్ర‌కు తాను డ‌బ్బింగ్ చెప్పుకుంటున్నాడు… ఇదేదో ప్ర‌భాస్‌ను బ‌ద్‌నామ్ చేసే కార్య‌క్ర‌మంలా ఉందే అనుకుంటున్నారా…? నిజ‌మేనండి ఇంత‌కు హిందిలో ప్ర‌భాస్‌కు గొంతు అరువిచ్చేవారు ఎవ‌రో తెలుసుకోవాల‌నుకుంటున్నారా… అయితే చ‌ద‌వండి…

యంగ్ రెబ‌ల్‌స్టార్ ప్ర‌భాస్ చేత‌నే సాహో ట్రైల‌ర్‌లో డ‌బ్బింగ్ చెప్పించారు చిత్ర యూనిట్‌. కానీ సినిమా మొత్తం డ‌బ్బింగ్ ఎవ‌రు చెప్పి ఉంటారు అనేది ఆస‌క్తిక‌రంగా ఉంది క‌దా. అయితే బాహుబ‌లి సినిమాకు శ‌ర‌ద్ కేల్క‌ర్ చేత డ‌బ్బింగ్ చెప్పించారు. ఈ గొంతు ప్ర‌భాస్ గొంతుకు అచ్చుగుద్దిన‌ట్లుగా స‌రిపోయింది. దీంతో ప్రేక్ష‌కుల‌కు ఏలాంటి ఇబ్బంది క‌లుగ‌లేదు స‌రిక‌దా త‌న పాత్ర‌కు తానే డ‌బ్బింగ్ చెపుకున్నాడ‌నే అనుకున్నారంతా..

అయితే ఇప్పుడు సాహో సినిమాకు ఎవ‌రితో డ‌బ్బింగ్ చెప్పించాల‌న్న‌దే ద‌ర్శ‌క నిర్మాత‌ల‌ను, డిస్ట్రిబ్యూట‌ర్ల‌ను వేధిస్తున్న ప్ర‌శ్న‌. ఎందుకంటే ప్ర‌భాస్ హిందిలో డైలాగ్ చెప్పాలంటే చాలా క‌ష్ట‌మ‌ట‌. దీనికి నిద‌ర్శ‌నంగా సాహో సినిమా ట్రైల‌ర్ విడుద‌ల సంద‌ర్భంగా ముంబాయిలో విలేక‌రుల‌తో హిందిలో మాట్లాడిన‌ప్పుడు లొసుగులు బ‌య‌ట‌ప‌డ్డాయ‌ట‌. ఇలా అయితే సినిమాను ఎలా మెనేజ్ చేస్తాడ‌ని టాక్ వినిపిస్తుంది. అందుకే ప్ర‌భాస్‌కు హిందిలో శ‌ర‌ద్ కేల్క‌ర్ చేత‌న‌న్నా లేక ప్ర‌హ్ల‌ద్ చేత‌న‌న్నా డ‌బ్బింగ్ చెప్పించాల‌ని చూస్తున్నార‌ట‌. అందుకు ప్ర‌భాస్ తానే డ‌బ్బింగ్ చెపుతానంటున్నాడ‌ట‌… సో ప్ర‌భాస్‌కు గొంతు ఇచ్చేదెవ‌రో చూడాలి మ‌రి.

హిందిలో సాహోకు డ‌బ్బింగ్ ఎవ‌రో తెలుసా…!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share