మేన‌ల్లుడి కోసం చిరు ఎంట్రీ

June 6, 2018 at 10:57 am
మెగా మేన‌ళ్లుడు సాయిధ‌ర‌మ్ తేజ్ ఐదు వ‌రుస ప్లాపుల‌తో విల‌విల్లాడుతున్నాడు. సాయి ఎన్నో అంచ‌నాల‌తో న‌టించిన చివ‌రి చిత్రం ఇంటిలిజెంట్ కూడా ఘోర‌మైన డిజాస్ట‌ర్ అయ్యింది. స్టార్ డైరెక్ట‌ర్ వివి.వినాయ‌క్ కూడా ఈ సినిమాను గ‌ట్టెక్కించ‌లేక‌పోయాడు. సాయి ప్లాపుల‌కు బ్రేక్ వేయ‌లేక‌పోయాడు. సాయి తాజా చిత్రం  ‘తేజ్ ఐ లవ్ యు’. 
 
సాయి చిన్న మామ ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌కు కెరీర్‌లోనే మ‌ర్చిపోలేని తొలిప్రేమ లాంటి క్లాసిక్ ఇచ్చిన క‌రుణాక‌ర‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన సినిమా కావ‌డంతో ఈ సినిమా అదిరిపోతుంద‌న్న అంచ‌నాలు ఉన్నాయి. అన్ని ప‌నులు కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా ఈ నెల‌లోనే రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ చిత్ర యూనిట్ ఆడియో వేడుకను ప్లాన్ చేసింది. ఈ నెల 9వ తేదీన హైదరాబాద్లోని జెఆర్సి కన్వెన్షన్ సెంటర్లో ఈ వేడుక జరగనుంది.
 
ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. వరుస ప్లాపుల‌తో ఉన్న ఈ సినిమాతో అయినా సాయి హిట్ కొడ‌తాడ‌ని మెగా అభిమానులు ఆశ‌లు పెట్టుకున్నారు. మేన‌ళ్లుడిని హెల్ఫ్ చేసేందుకు, ఈ సినిమాను త‌న వంతుగా ప్ర‌మోట్ చేసేందుకు చిరంజీవి ఈ ఆడియే వేడుక‌కు ముఖ్య అతిథిగా హాజ‌ర‌వుతున్నారు.
 
ఫస్ట్ లుక్, టీజర్ బాగుండటంతో సినిమాపై ప్రేక్షకుల్లో పాజిటివ్ అభిప్రాయమే ఉంది. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రాన్ని జూన్ 29న విడుదలచేయనున్నారు. క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ పై కె.ఎస్.రామారావు నిర్మిస్తున్న ఈ సినిమాకు గోపి సుందర్ సంగీతాన్ని అందిస్తున్నారు. మ‌రి మేన‌మాళ హెల్ఫ్ సాయికి ఎంత వ‌ర‌కు వ‌ర్క‌వుట్ అవుతుందో ?  చూడాలి.
De-09LhU0AEomLa
మేన‌ల్లుడి కోసం చిరు ఎంట్రీ
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share