శ్రీదేవినే తలపించిన జాన్వీ….’ధడక్‌’ ట్రైలర్‌

June 11, 2018 at 3:19 pm

నటి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్‌ ఫాలోయింగ్ రోజు రోజుకు పెరిగి పోతుంది, అమ్మడు సోషల్ మీడియా సాక్షిగా లో దుస్తులు వేసి రచ్చ రచ్చ చేసింది ఈ మధ్య. దాని దెబ్బతో అమ్మడు శ్రీ దేవి కూతురు గాను బాలీవుడ్ హీరోయిన్ గాను మంచి క్రేజ్ తెచ్చుకుంది. జాన్వీ డెబ్యూ మూవీ ధడక్‌ ట్రైలర్‌ వచ్చింది ఈ రోజు, ఈ సినిమాలో ఇషాన్‌ ఖట్టర్‌, జాన్వీ జంటగా నటిస్తున్నారు.. ధర్మ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై కరణ్‌ జోహర్‌ నిర్మిస్తున్నారు.

మరాఠీ హిట్‌ సైరాట్‌కు రీమేక్‌ గా ఈ సినిమా తెరకెక్కుతుంది. మరాఠీ భాషలో ఈ సినిమా సూపర్ హిట్ అయి అవార్డులను కూడా గెలుచుకుంది, ఈ సినిమాకే రీమేక్ గా రావటం హిందీలో మంచి బజ్ కొనసాగుతుంది. ‘ఎప్పుడైతే రెండు వేర్వేరు ప్రపంచాలు కలుస్తాయో.. అవి ఒక్కటిగా మారిపోవటం ఖాయం’ పలికిన ఓ డైలాగు అందరిని ఆకట్టుకుంటుంది.

శ్రీదేవినే తలపించిన జాన్వీ….’ధడక్‌’ ట్రైలర్‌
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share