రాజ‌మౌళిని త‌ప్పుప‌ట్టిన ప్ర‌భాస్‌… అది పెద్ద రాంగ్‌

August 14, 2019 at 7:25 pm

ప్ర‌భాస్ సాహో సినిమా ప్ర‌మోషన్ల‌లో బిజీబిజీగా దూసుకుపోతున్నాడు. ఈ ప్ర‌మోష‌న్ల‌లో కేవ‌లం సాహో సినిమా విష‌యాలే కాకుండా, సాహో బ‌డ్జెట్, త‌న పెళ్లి గురించి వ‌స్తోన్న వార్త‌ల‌కు సైతం క్లారిటీ ఇస్తున్నాడు. ఈ క్ర‌మంలోనే ఈ ఇంట‌ర్వ్యూలో రాజమౌళి గురించి కూడా ఒక ప్రశ్నను అడిగారు. గతంలో రాజమౌళి కాఫీ విత్ కరణ్ షో లో పాల్గొన్నాడు.

ఆ ఇంట‌ర్వ్యూలో రాజ‌మౌళి మాట్లాడుతూ నార్త్ సూపర్ స్టార్లతో పోలిస్తే సౌత్ సూపర్ స్టార్లు తమ అభిమానులకు ఏం కావాలనే విషయం గ్రహించడంలో చాలా ముందున్న‌ట్టుగా కామెంట్ చేశారు. అప్ప‌ట్లో బాలీవుడ్ మీడియాలో దీనిపై పెద్ద ఎత్తున చ‌ర్చ‌లు న‌డిచాయి. కొంద‌రు రాజ‌మౌళి వ్యాఖ్య‌ల‌ను లైట్ తీస్కొంటే మ‌రి కొంద‌రు ట్రోల్ చేశారు.

ఈ వ్యాఖ్య‌ల‌పై తాజాగా ప్ర‌భాస్‌ను ప్ర‌శ్నిస్తే ప్ర‌భాస్ రాజ‌మౌళి వ్యాఖ్య‌ల‌ను త‌ప్పుప‌ట్టేలా మాట్లాడాడు. ఆ విషయంలో రాజమౌళి అభిప్రాయం సరైనదని నేను అనుకోన‌ని చెప్పాడు. బాలీవుడ్‌లో వాళ్లు సూప‌ర్ స్టార్లు అయిన‌ప్పుడు ఆ విష‌యం వాళ్ల‌కు తెలియ‌కుండా ఉంటుంద‌ని ఎలా అనుకోగ‌లం అని కూడా త‌న అభిప్రాయం వెల్ల‌డించాడు. ఎవ‌రికి అయినా ఒక్కో విష‌యంలో భిన్నాభిప్రాయాలు స‌హ‌జంగానే ఉంటాయి… అయితే ఈ సంక్లిష్ట‌మైన ప్ర‌శ్న‌కు ప్ర‌భాస్ చాలా తెలివైన ఆన్స‌ర్‌తో ఎలాంటి వివాదం చెల‌రేగ‌కుండా చూసుకున్నాడు.

అదే ప్ర‌భాస్ రాజ‌మౌళి మాట‌ను స‌మ‌ర్థిస్తూ మాట్లాడుతూ బాలీవుడ్ స్టార్లు ఫ్యాన్స్ కు ఏం కావాలో తెలుసుకోలేక పోతున్నారు అంటే నార్త్ ఫ్యాన్స్ పెద్ద గ‌గ్గోలు పెట్టేస్తారు. ఇది చాలా కాంట్ర‌వ‌ర్సీకి దారితీస్తుంది. కానీ ప్ర‌భాస్ సింపుల్‌గా ఆన్స‌ర్ ఇచ్చి స‌రిపెట్టేశాడు.

రాజ‌మౌళిని త‌ప్పుప‌ట్టిన ప్ర‌భాస్‌… అది పెద్ద రాంగ్‌
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share