పవన్ లోని మరో కోణాన్ని బయటపెట్టిన అక్కినేని హీరోయిన్!

August 6, 2018 at 10:22 am

టాలీవుడ్ లో మెగాస్టార్ తమ్ముడు పవన్ కళ్యాన్ మొదటి సినిమా ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’. ఈ సినిమాలో పవన్
సరసన హీరోయిన్ గా నటించిన నాగార్జున మేనకోడలు సుప్రియ ఆతర్వాత సినిమాలకు దూరమమై అన్నపూర్ణ స్టూడియో బాధ్యతల్ని నిర్వహిస్తూ 22ఏళ్ల తర్వాత ‘గూఢచారి’ సినిమాతో తిరిగి రీ ఎంట్రీ ఇవ్వడమే కాకుండా ఆమె ఆసినిమాలో ఆమె నటించిన నదియా ఖురేషి పాత్రతో అందరినీ ఆకట్టుకుంది. అయితే పవన్ నటించిన మొట్టమొదటి సినిమాలో సుప్రియనే హీరోయిన్. ఆ మూవీ తర్వాత తెరకు దూరమైంది సుప్రియ.

_44a7a370-f689-11e7-9cc5-99c3d5c09a90

కానీ పవన్ మాత్రం అంచెలంచెలుగా ఎదిగి నంబర్ వన్ స్టార్ అనిపించుకున్నాడు. తాను సినిమాలకు దూరమై 22 ఏళ్లు అయిపోయిన తరువాత తనను వెండితెర పై చూస్తే ప్రేక్షకులు ఆదరిస్తారా అన్నభయం చివరివరకు ఉందని అందువల్లనే తాను ఈమూవీ విషయంలో తెగ టెన్షన్ పడ్డ సందర్భాలను వివరించింది. ఈ సందర్భంగా పవన్ గురించి మాట్లాడుతూ.. పవన్ ఇంత పెద్ద స్టార్ అవుతాడని తను కలలో కూడా ఊహించలేదంటోంది. నేను సినిమాలు మానేసి 22 సంవత్సరాలు అవుతోంది. కానీ పవన్ దృష్టిలో ఇప్పటికీ నేను హీరోయిన్ నే. నన్ను తను హీరోయిన్ గానే చూస్తారు.

Supriya-Yarlagadda-on-About-Pawan-kalyan--1533468411-120

అది నాకు చాలా ఆనందాన్నిస్తోంది. మొదటి సినిమాలో తనతో కలిసి నటించినప్పుడు పవన్ అందరు హీరోల్లానే కనిపించాడు..కానీ ఇప్పుడు ఆయన రేంజ్ చూస్తుంటే..ఫ్యాన్ ఫాలోయింగ్ చూస్తుంటే షాకింగ్ గా ఉందని అన్నారు. పవన్ తో కలిసి నటించిన సినిమా షూటింగ్ మూమెంట్స్ తనకు ఇంకా గుర్తున్నాయని, చాలా ఎంజాయ్ చేశానని అంటోంది. అయితే తన మొహం నెగిటివ్ కేరెక్టర్స్ కు బాగా సూటవుతోంది కాబట్టి నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలు తన దృష్టికి వస్తే నటిస్తూ తన తాత మనవరాలిగా తన ఇమేజ్ ని పెంచుకోవడానికి ప్రయత్నిస్తాను అని అంటోంది అక్కినేని మనవరాలు.

పవన్ లోని మరో కోణాన్ని బయటపెట్టిన అక్కినేని హీరోయిన్!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share