పవన్ బాబాయ్ వల్ల ఇంట్లో ఎప్పుడు గొడవలు : సుస్మిత

August 20, 2018 at 1:24 pm

ఈ మాటలు అంటుంది ఎవరో కాదు..మెగాస్టార్ చిరంజీవి ముద్దుల కూతుళ్లు..సుస్మిత, శ్రీజ. కోట్ల మంది అభిమానుల అభిమానాన్ని సొంతం చేసుకున్న మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు ఆగస్టు 22. ఈ సందర్భంగా ఆయన ఫ్యాన్స్ ఎంతో ఘనంగా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అంతే కాదు రేపు ఆయన నటిస్తున్న ‘సైరా’ టీజర్ కోసం వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు. తాజాగా ఓ టీవిఛానల్ ఇంటర్వ్యూలో సుస్మిత, శ్రీజ ఎన్నో సంచలన విషయాలు బయట పెట్టారు.636703073453807336

మీ ఇంట్లో ఎవరు ఎక్కువ గొడవపడేవారు..ఎందుకు పడేవారు అన్న ప్రశ్నకు సుస్మిత మాట్లాడుతూ.. నేను, చరణ్, శ్రీజ చిన్నపుడు ముగ్గురు తెగ అల్లరి చేసేవాళ్లమని..అందులో నేను, చరణ్ ఎక్కువ గొడవ పడేవాళ్లమని..శ్రీజ చాలా మంచి అమ్మాయి…తన చదువు తాను చదువుకుంటూ ఓ మూలన కూర్చుని ఉండేదని అన్నారు. అయితే చరణ్ , నాకు మద్య గొడవలు మా కళ్యాన్ బాబాయి ఎక్కువ పెట్టేవారని..ఒకరి పై ఒకరిని ఉసిగొలిపి గొడవపడేలా చేస్తూ నవ్వేవారని..అది చాలా ఫన్నీగా ఉండేదని సుస్మిత అన్నారు.Pawan-kalyan-Attend-for-Ram-Charan-Birthday-Celebrations-1522158422-1026

శ్రీజ అయితే చాలా సైలెంట్. మా ముగ్గురిలో తనే మోస్ట్ క్వాలిఫైడ్… బాగా చదువుకుంది అని అన్నారు సుస్మిత. ఇక శ్రీజ మాట్లాడుతూ..అన్నయ్య, అక్కలు గొడవ పడుతుంటే..నాకు పెద్దగా ఇంట్రెస్ట్ ఉండేది కాదని..అందుకే నేను ఎవరికీ సపోర్ట్ చేసేదాన్ని కాదని అన్నారు. ఇక ఇంట్లో నేనే చిన్నపిల్ల కావడంతో అందరూ నన్ను బాగా గారాభం చేసేవారని నాకు చదువుకోవడం అంటే చాలా ఇష్టం. ఇక్కడ గ్రాడ్యుయేషన్ చేశాక… లండన్ వెళ్లి మాస్టర్స్ చేశా.బాడ్మింటన్ నేషనల్ లెవల్స్కి వెళ్లా’’ అని శ్రీజ తెలిపింది.Master

పవన్ బాబాయ్ వల్ల ఇంట్లో ఎప్పుడు గొడవలు : సుస్మిత
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share