సైరా హింది హ‌క్కులు అమ్మేశార‌ట‌…!

August 13, 2019 at 4:45 pm

ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డి… ఈపేరు అస్స‌లు విని ఉండ‌రు.. స‌రిక‌దా ఎవ్వ‌రికి తెలియ‌దు.. .కానీ ఇప్పుడు ఈ పేరు ప్ర‌పంచ వ్యాప్తంగా అక్టోబ‌ర్ 2 నుంచి మార్మోగ‌బోతుంది. ఇంత‌కు ఈ వ్య‌క్తి ఓ స్వాతంత్య్ర స‌మ‌రయోధుడు అనే విష‌యం సైరా సినిమాతో తెలువ‌బోతుంది. అయితే సైరా న‌ర‌సింహారెడ్డి గా మెగాస్టార్ చిరంజీవి న‌టించి, ఆయ‌న త‌న‌యుడు మెగా ప‌వ‌ర్‌స్టార్ రామ్ చ‌ర‌ణ్ తేజ్ నిర్మిస్తున్న ఈ చిత్రం ప‌లు భాష‌ల్లో తెర‌కెక్కుతుంది.

అయితే ఈసినిమా షూటింగ్ ఇప్ప‌టికే పూర్తి అయింది. భారీ బ‌డ్జెట్ తో తెర‌కెక్కుతున్న ఈ చిత్రం బాలీవుడ్‌, కోలీవుడ్‌, టాలీవుడ్ లో ప్ర‌పంచ వ్యాప్తంగా అక్టోబ‌ర్ 2న విడుద‌ల అవుతున్న సంద‌ర్భంగా ఈ సినిమా డ‌బ్బింగ్ ప‌నులు పూర్తి చేసుకుంది. ఇక నిర్మాణాంత‌ర ప‌నుల‌ను శ‌ర‌వేగంగా జ‌రుపుకుంటుంది. అయితే ఈసినిమాకు సంబంధించిన ప్ర‌మోష‌న్ ప‌నుల‌ను ద‌ర్శ‌కుడు సురేంద‌ర్‌రెడ్డి పూర్తి చేస్తుండ‌గా, నిర్మాత రామ్ చ‌ర‌ణ్ తేజ్ మాత్రం సినిమా హ‌క్కుల‌ను అమ్మెందుకు సిద్ధ‌మ‌య్యాడు.

ఈ సినిమా బాలీవుడ్‌లో విడుద‌ల చేసేందుకు అనిల్ ద‌డాని, ఫ‌ర్హ‌న్‌ అక్త‌ర్ ఎక్సైల్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ హింది హ‌క్కుల‌ను కొనుగోలు చేశార‌ట‌. ఈ ఇద్ద‌రి ఆధ్వ‌ర్యంలో ఈసినిమాను బాలీవుడ్‌లో విడుద‌ల చేస్తారు. ఈ మేర‌కు సైరా చిత్రాన్ని నిర్మిస్తున్న కొడిదేల ప్రొడ‌క్ష‌న్ కంపెనీ అధికారికంగా ట్వీట్ట‌ర్ ఖాతాలో తెలిపింది. క‌న్న‌డ‌లో తీసిని కేజీఎఫ్ చిత్రాన్ని హిందిలో విడుద‌ల చేసింది వీరే. అందుకే వీరివైపు మొగ్గు చూపార‌ట మెగా కుటుంబం.

సైరా హింది హ‌క్కులు అమ్మేశార‌ట‌…!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share