
ఓ భారత స్వాతంత్య్ర సమరయోధుడి జీవిత కథను బయోపిక్‌గా తెరకెక్కిస్తున్న చిత్రం సైరా. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఈ చిత్రంను చిరంజీవి తనయుడు మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ తేజ్ తన సొంత నిర్మాణ సంస్థ కొణిదేల ప్రొడక్షన్ కంపెనీ నుంచి నిర్మిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని ఇప్పుడు నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటుంది.
ఇక సైరా సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలపై దృష్టి సారించింది చిత్ర యూనిట్. అందులో భాగంగానే చిత్ర యూనిట్ సైరా చిత్రంకు సంబంధించిన మేకింగ్ వీడియోను ఈనెల 14న అధికారికంగా లాంచ్ చేయనున్నదట. అయితే ఆ మేకింగ్ వీడియో విడుదలకు ముందు చిరంజీవి తన అధికారిక ట్వీట్టర్ ఖాతాలో చిత్ర మేకింగ్ లో మెగాస్టార్ చిరంజీవి తమ్ముడు, పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ భాగమయ్యాడట.
సైరా మేకింగ్ వీడియోలో పవన్ కళ్యాణ్ కూడా ఉండబోతున్నారనే సంకేతాలు ఇచ్చారు. సైరా షూటింగ్ సమయంలో చిత్రంలో రాజగురువుగా నటిస్తున్న బాలీవుడ్ సూపర్‌స్టార్ అమితాబ్ బచ్చన్‌ను, సైరా హీరో మెగాస్టార్ చిరంజీవి, సిని నిర్మాత, మెగా తనయుడు రామ్ చరణ్ తేజ్‌తో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ కలిసి దిగిన ఫోటోను ట్వీట్టర్లో కొద్ది సేపటి క్రితమే షేర్ చేసారు. అంటే మేకింగ్ వీడియోలో పవర్‌స్టార్ కూడా ఉండబోతున్నాడన్నమాట.