సైరాకోసం స్వరదానం చేసిన పవన్ కల్యాణ్

August 16, 2019 at 10:30 am

మెగాస్టార్ చిరంజీవి, పవన్ స్టార్ పవన్ కల్యాణ్ ల మద్య అనుబంధం గురించి.. ఎందరు ఎన్నిరకాలుగానైనా అనుకోవచ్చు గాక.. కానీ వారిద్దరి బాంధవ్యం ఎంతో దృఢతరమైనది. అందుకే.. సినిమాలకు ఇక పూర్తిగా దూరం అని ఇప్పటికే పదేపదే ప్రకటించిన పవన్ కల్యాణ్, అన్నయ్య చిరంజీవి చిత్రం ‘సైరా.. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’ కోసం.. గాత్రదానం చేశారు. ఈ చిత్రానికి ఆయన వాయిస్ ఓవర్ డబ్బింగ్ చెప్పారు.

హీరో ఉయ్యాలతవాడ నరసింహారెడ్డి చరిత్రను ప్రేక్షకులకు సంక్షిప్తంగా పరిచయం చేసే వాయిస్ ఓవర్ ను పవన్ కల్యాణ్ తో ఇటీవలే రికార్డు చేయించారు. ఈ రికార్డింగ్ లో స్వయంగా చిరంజీవి కూడా దగ్గరుండి పాల్గొన్నారు. అన్నయ్య చిత్రం కోసం వాయిస్ ఓవర్ తో గాత్ర దానం చేయడం తనకు ఎంతో సంతోషంగా ఉన్నదని.. పవన్ కల్యాణ్ అన్నారు.

చిరంజీవి హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితాన్ని వెండితెర కథగా మలుస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ చిత్రంలో అమితాబ్ తదితరులు కూడా నటిస్తున్నారు. చాలా ప్రతిష్ఠాత్మకంగా భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ కూడా త్వరలోనే విడుదల కాబోతోంది. అయితే ఈ చిత్రం కోసం పవన్ కల్యాణ్ వాయిస్ ఓవర్ చెప్పారు.

‘‘అందరూ గుర్తించిన వీరులు ఎందరో ఉన్నారు..కానీ ఎవ్వరూ గుర్తించని వీరుడు ఒకడున్నాడు. ఆయనే ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి’’ అని ఈ చిత్రం కోసం పవన్ కల్యాణ్ చెప్పిన డైలాగును ఈనెల 14న బుధవారం రికార్డింగ్ చేశారు. రికార్డింగ్ సమయంలో మెగాస్టార్ చిరంజీవి కూడా పవన్ కల్యాణ్ తో పాటు ఉన్నారు. దానికి సంబంధించి.. పవన్ కల్యాణ్ డబ్బింగ్ చెబుతున్నప్పటి చిత్రాన్ని గురువారం మీడియాకు విడుదల చేశారు.

సైరాకోసం స్వరదానం చేసిన పవన్ కల్యాణ్
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share