‘ సైరా ‘ మేకింగ్‌.. ఊహ‌ల‌కే మించి… ద వ‌ర‌ల్డ్ ఆఫ్ సైరా

August 14, 2019 at 3:47 pm

భార‌త దేశంను పాలిస్తున్న బ్రిటిష్ పాల‌కుల నుంచి విముక్తి క‌ల్పించేందుకు చేసిన పోరాటం భార‌త స్వాతంత్రోధ్య‌మ ఉద్య‌మం. ఈ ఉద్య‌మంలో ఎందరో అసువులు బాశారు. దేశానికి స్వాతంత్య్రం కోసం నిరంత‌ర పోరాటం జ‌రిగినప్ప‌టికి మొదటి స్వాతంత్య్ర పోరాటం చ‌రిత్ర‌లో నిలిచిపోతుంది. దేశం కోసం పోరాడిన మొద‌టిత‌రం స్వాతంత్య్ర పోరాటంలో పాల్గోని అసువులు బాసిన వీరుడు, యోధుడు ఉయ్యాలవాడ న‌ర‌సింహారెడ్డి.

ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డి జీవిత‌క‌థ‌ను బ‌యోపిక్‌గా తెర‌పైకి తీసుకొస్తున్నాడు ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు సురేంద‌ర్‌రెడ్డి. మెగా ప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ తేజ్ నిర్మిత‌గా త‌న సొంత నిర్మాణ సంస్థ కొణిదెల ప్రొడ‌క్ష‌న్ కంపెనీలో నిర్మాణం జ‌రుపుకుంటుంది. ఈ సినిమాలో ఉయ్యాలవాడ న‌ర‌సింహారెడ్డి పాత్ర‌లో మెగాస్టార్ చిరంజీవి న‌టిస్తున్నాడు. చిత్రానికి పెట్టిన పేరు సైరా న‌ర‌సింహారెడ్డి. ఈ సైరా చిత్రం టీజ‌ర్‌ను గ‌తంలో విడుద‌ల చేసింది చిత్ర యూనిట్‌.

ఇప్పుడు ఈ చిత్రంకు సంబంధంచిన మేకింగ్ వీడియోను విడుద‌ల చేశారు. మేకింగ్ వీడియోలో మెగాస్టార్ చిరంజీవి న‌టించిన తీరును, ద‌ర్శ‌కుడు, సాంకేతిక నిపుణులు త‌న ప‌నితీరును ఈ మేకింగ్ వీడియోలో చూపించారు. మేకింగ్ వీడియోను 1.47 నిమిషాల నిడివితో విడుద‌ల చేశారు. భారీ యాక్ష‌న్ సీన్స్‌తో మేకింగ్ వీడియోను విడుద‌ల చేసింది చిత్ర యూనిట్‌. ఇందులో బాలీవుడ్ సూప‌ర్‌స్టార్ అమితాబ్ బ‌చ్చ‌న్‌, మెగాస్టార్ చిరంజీవి, కిచ్చ సుదీప్‌, విజ‌య్ సేతుప‌తి, జ‌గ‌ప‌తిబాబు, అనుష్క‌, త‌మ‌న్నా, నిహారిక‌తో పాత్ర‌ల‌ను ప‌రిచ‌యం చేశారు. ఇప్పుడు ఈ టీజ‌ర్ నెట్టింట్లో హ‌ల్‌ఛ‌ల్ చేస్తోంది

‘ సైరా ‘ మేకింగ్‌.. ఊహ‌ల‌కే మించి… ద వ‌ర‌ల్డ్ ఆఫ్ సైరా
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share