డ్రగ్ ఇష్యూలో.. నందు పాత్రపై నిజం చెప్పిన గీత మాధురి

ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీని డ్రగ్స్ రాకెట్ ఓ ఊపు ఊపేస్తోంది. రెండు రోజులుగా ఈ ఇష్యూపై పెద్ద క‌ల‌క‌లం రేగుతోన్న సంగ‌తి తెలిసిందే. ఇదిలా ఉంటే ఈ డ్ర‌గ్ మాఫియాలో ప‌లువురు సినీ ప్రముఖుల పేర్లు బ‌య‌ట‌కు వ‌చ్చేశాయి. నిన్న‌టి వ‌ర‌కు సీక్రెట్‌గా ఉన్న వీరి పేర్లు ఈ రోజు బ‌య‌ట‌కు రావ‌డంతో టాలీవుడ్ మొత్తం ఉలిక్కిప‌డింది. ఇక వీరికి సిట్ నోటీసులు కూడా అంద‌జేసింది.

డ్ర‌గ్స్ ఇష్యూలో పేర్లు బ‌య‌ట‌కు వ‌చ్చిన వారిలో ప్ర‌ముఖ గాయని గీతామాధురి భర్త, యువ నటుడు నందు కూడా ఉన్న సంగతి తెలిసిందే. డ్ర‌గ్స్ మాఫియాలో త‌న పేరు బ‌య‌ట‌కు రావ‌డంపై ముందుగా స్పందించిన నందు అస‌లు జీవితంలో త‌న‌కు డ్ర‌గ్స్ అంటే ఏంటో తెలియ‌ద‌ని, వాటిని తాను చూడ‌లేద‌ని స్ప‌ష్టం చేశారు. 

ఇక త‌న భ‌ర్త పేరు బ‌య‌ట‌కు రావ‌డంతో గీతా మాధురి కూడా మీడియాతో మాట్లాడారు. త‌న భ‌ర్త ఎప్పుడూ డ్ర‌గ్స్ తీసుకోలేదని, డ్రగ్స్ సప్లయర్లు, నందుకు మధ్య లింకులు ఉన్నాయనడం అవాస్తవం. నందూ అలాంటివాడు కాదు.. డ్ర‌గ్స్‌కు అత‌డు బానిస కాదు..ఇలాంటి వార్త‌లు ప్ర‌సారం చేసేముందు వాస్త‌వాలు తెలుసుకోవాలంటూ షాక్ ఇచ్చారు.

ఓ ప‌క్క మీడియాలో నందు పేరు ఊద‌ర‌గొట్టేస్తుంటే ఇటు నందుతో పాటు ఆయ‌న భార్య గీతామాధురి త‌మ‌కు అస‌లే డ్ర‌గ్సే తెలియ‌దంటూ పెద్ద షాకే ఇచ్చారు.