
సెక్స్ రాకెట్ ఇప్పుడు టాలీవుడ్‌ను కుదిపేస్తోంది. ఇందులో ఒక ప్రముఖ యాంకర్‌తో పాటు హీరోయిన్ కూడా ఉన్నారనే వార్తలు సంచలనం సృష్టిస్తున్నాయి. గుట్టుగా జరిగిపోతున్న ఈ భారీ కుంభకోణం వెలుగులోకి ఎలా వచ్చింది? దీనిని పోలీసులు ఎలా గుర్తించారు? ఈ సెక్స్ రాకెట్‌ను బయటపెట్టిన ఆ క్లూ ఏంటి? అనేది ఇప్పుడు అందరికీ ఆసక్తిగా మారింది. ఈ భారీ సెక్స్ కుంభకోణం వెలుగులోకి రావడానికి ఒకే ఒక్క కారణం.. చిన్న చిత్తు కాగితం! అవును. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా.. ఇదే నిజం! ఒక చిన్న కాగితమే ఎంతోమంది చీకటి జీవితాలను వెలుగులోకి తెచ్చింది. సెక్స్ రాకెట్‌కు సంబంధించిన సూత్రధారుల పేర్లు బయటికి వచ్చేలా చేసింది. మరికొంతమందికి నిద్ర లేకుండా చేస్తోంది! ఎంతోమంది జీవితాలను తల్లకిందులు చేసేసిన వారిని తెరపైకి తెచ్చింది.
చిన్న చిత్తు కాగితమే అని పాడేయడమే ఆ దంపతులను కటకటాల వెనక్కి వెళ్లేలా చేసింది. కిషన్ మోదుగుపూడి.. ఇప్పుడు ఈ పేరు టాలీవుడ్‌ను ఊపేస్తోంది. వీసా గడువుతీరిన అమెరికాలో ఆయన ఉండడంతో పోలీసులు అనుమానించి.. వారిని అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. అంతకు ముందు అమెరికాలో జరుగుతున్న తెలుగు సంఘాల ఆహ్వానం మేరకు అక్కడికి వెళ్లిన ఓ హీరోయిన్.. వేడుక అనంతరం కిషన్ మోదుగుపుడి నిర్వహించే సెక్స్ రాకెట్ లో పాల్గొనేందుకు వెళుతోందనే అనుమానంతో పోలీసులు అరెస్ట్ చేశారని, అనంతరం ఆ హీరోయిన్ చెప్పిన వివరాల ఆధారంగా కిషన్ మోదుగుపుడి, అతని భార్య చంద్రకళ మోదుగుపుడిలను అరెస్ట్ చేశారనే వార్తలు వచ్చాయి.
కిషన్ దంపుతులు వీసా గడువుతీరిన అమెరికాలో ఉండడంపై అరెస్ట్ చేసిన పోలీసులు అదుపులోకి తీసుకొని వారి ఇళ్లలో సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ సోదాల్లో కిషన్ దంపతులు సెక్స్ రాకెట్ నిర్వహిస్తున్నట్లు తేలింది. వీసా గడువు ముగియడంతో ఓహియోలోని అమెరికా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వాస్తవానికి వారి వీసా గడువు తేదీ 2016 ఆగస్ట్ తో ముగిసింది. అయినా అమెరికాలో ఉండడంతో వారిని అరెస్ట్ చేసి జైలుకు తరలిం చారు. ఆ తరువాత కొద్దిరోజులకు విడుదలయ్యారు. ఆ సమయంలో కిషన్ ఇంట్లో సోదాలు నిర్వహించిన యూఎస్బీపీ అధికారులు ఎన్నో పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. చేతి అక్షరాలతో రాసి ఉన్న ఓ చిత్తు కాగితాన్ని పరిశీలించారట.
అందులో మారియట్ హోటల్ పేరుతో ఉన్న కొంతమంది విఠుల ఫోనె నెంబర్లు, రూంనెంబర్లు, పలువురి హీరోయిన్ల పేర్లు ఉండడంతో కిషన్ దంపుతులు సెక్స్ రాకెట్ నడుపుతున్నట్లు తేలింది. ఆ తర్వాత ఫిబ్రవరి 16వ తేదీన కిషన్ ఇంట్లో సోదాలు నిర్వహించిన పోలీసులకు కండోమ్స్ ప్యాకెట్లు, పలువురి హీరోయిన్ల పేర్లు, ఫోన్ నెంబర్లు, సెక్స్ రాకెట్ కు సంబంధించి లావాదేవీల వివరాలు ఉండడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చి.. వారి చీకటి దందా బట్టబయలైంది.