
తమిళ చిత్రం జిగర్తాండకు రీమేక్‌గా తెలుగులో వస్తున్న చిత్రం వాల్మీకి. ఈ సినిమాలో హీరోగా మెగా ప్రిన్స్ వరుణ్‌తేజ్ నటిస్తున్నాడు. వరుణ్‌తేజ్ సరసన పూజాహెగ్డే నటిస్తుంది. సినిమాకు హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌ను చిత్ర యూనిట్ పంద్రాగస్టును పురస్కరించుని విడుదల చేసింది.
వాల్మీకి చిత్రంలో వరుణ్‌తేజ్ రూపు చూస్తే ఒళ్ళు గగురుపుట్టించేలా ఉంది. వరుణ్‌తేజ్ ఆహార్యం చూస్తే జడుసుకోవడం ఖాయం. ఇందులో ఓ మాస్ లుక్‌లో బాగా పెరిగి మాసిన గడ్డం, బెదురు కనుగుడ్లు, ఉంగరాల జుట్టు, మెడలో దండలు, నల్లని బట్టలతో ఓ కర్కషుడైన వీధి రౌడిలా ఉన్నాడు. వరుణ్‌తేజ్ పోషించిన పాత్రకు ఆతని వేశానికి సరిగ్గా సూటు అయ్యేలా చూసాడు దర్శకుడు హరీష్‌శంకర్.
టీజర్లో వరుణ్‌తేజ్‌ను చూస్తే భయంకరమైన రౌడీలా ఉన్నాడంటే అతిశయోక్తి కాదు. ఈ టీజర్‌తో సినిమాపై భారీ హైప్‌ను క్రియోట్ చేశాడు దర్శకుడు హరీష్‌శంకర్, ఇందులో వరుణ్‌తేజ్ వాడిన డైలాగ్‌లు కూడా దడ పుట్టించేలా ఉన్నాయి. పెద్దలు చెప్పారు… నాలుగు బుల్లెట్లు సంపాదిస్తే అందులో రెండు వాడుకోవాలి… రెండు దాసుకోవాలి అనే డైలాగ్‌ను టీజర్లో వదిలారు. సో మొత్తానికి టీజర్‌తో సినిమాకు మాత్రం ఎక్కడ లేని క్రేజ్‌ను తెప్పించాడు దర్శకుడు.