విక్ర‌మ్..ప‌రిస్థితి ఎంత ద‌య‌నీయంగా ఉందో!

July 23, 2019 at 1:19 pm

అంతేలే.. కాలం ఎప్పుడు ఎవ‌రిని నెత్తికిఎత్తుకుంటుందో.. ఎప్పుడు నేల‌కేసి కొడుతుందో ఊహ‌కంద‌ని విష‌యం.. ఒక‌ప్పుడు క్యారెక్ట‌ర్ ఆర్టిస్టుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి.. ఆ త‌ర్వాత టాలీవుడ్ టాప్ హీరోల‌కు దీటుగా.. విలక్ష‌ణ న‌టుడిగా ఓ వెలుగువెలిగాడు.. తాజాగా.. సినిమా విడుద‌ల అయిన రెండో రోజుకే థియేట‌ర్ల నుంచి తొల‌గించ‌డాన్ని చూస్తే… పాపం..! ఆ స్టార్ హీరో ప‌రిస్థితి ఎంత ద‌య‌నీయంగా ఉందో అర్థం చేసుకోవ‌చ్చు. ఆ విల‌క్ష‌ణ న‌టుడు మ‌రెవ‌రో కాదు.. విక్ర‌మ్‌. మొద‌ట్లో.. విక్ర‌మ్ సినిమా అంటే.. ప్రేక్ష‌కులు ఎంతో ఆతృత‌గా ఎదురుచూసే వారు.. కానీ.. ఇప్పుడు ఆయ‌న సినిమా ఎప్పుడు వ‌స్తుందో కూడా స‌గ‌టు ప్రేక్ష‌కుడికి తెలియ‌డం లేదు.

ఇటీవ‌లే విక్ర‌మ్ కొత్త సినిమా మిస్ట‌ర్ కెకె విడుద‌ల అయింది. అయితే.. ఇక్క‌డ దారుణ‌మైన విష‌యం ఏమిటంటే.. గ‌త శుక్ర‌వారం ఈ సినిమా విడుద‌ల అయింది. రెండో రోజు శ‌నివారం నాటికే చాలా థియేట‌ర్ల‌లో సినిమాను తొల‌గించారు. దీనిని బ‌ట్టి అర్థం చేసుకోవ‌చ్చు. మిస్ట‌ర్ కెకె సినిమా ఎలా ఉందో. నిజానికి.. ఈ సినిమా వ‌చ్చిన‌ట్లు కూడా ఎవ‌రికీ పెద్ద‌గా తెలియ‌దు. అంటే.. హీరో విక్ర‌మ్‌ను జ‌నం ప‌ట్టించుకోవ‌డం లేద‌న్న‌మాట‌. ఒక‌ప్పుడు.. ఆయ‌న సినిమా కోసం ప‌డిగాపులుగాసిన ప్రేక్ష‌కులు.. ఇప్పుడు ఇలా దూరంగా ఉండ‌డం గ‌మ‌నార్హం.

తెలంగాణ‌తోపాటు ఆంధ్రలోని చాలా పట్టణాల్లో మిస్టర్ కెకె సినిమాను థియేట‌ర్ల నుంచి తొలిగించారు. ఆ స్థానంలో ఇస్మార్ట్ శంకర్, ఓ బేబీ సినిమాల్ని న‌డిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం. అయితే.. విక్ర‌మ్ కోసం సినిమాకు వెళ్లిన ప్రేక్ష‌కుల‌కు తీవ్ర నిరాశే ఎదురైంది. ఈ సినిమాలో క‌థ బ‌లంగా లేక‌పోవ‌డం.. విక్ర‌మ్ న‌ట‌న కూడా బోరింగ్‌గా ఉండ‌డంతో రెండో రోజే సినిమాను ఎత్తేశారు. పాపం విక్ర‌మ్‌..! ముందుముందు ప‌రిస్థితి ఎలా ఉంటుందో మ‌రి.

విక్ర‌మ్..ప‌రిస్థితి ఎంత ద‌య‌నీయంగా ఉందో!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share