‘యాత్ర’ ఫస్ట్ డే కలెక్షన్స్

February 9, 2019 at 11:07 am

వైఎస్సార్ జీవితంలో ఒక చారిత్మక ఘట్టం ‘యాత్ర’, ఆ యాత్రతో ఆంధ్రాలో నెగ్గటం కష్టం అనుకున్న కాంగ్రెస్ పెద్దలకు తిరుగులేని మెజారిటీతో గెలిచిపించి వైఎస్సార్ సత్తా ఏంటో చాటారు. ఆ ‘యాత్ర’ ఆధారంగా మ‌హి వీ రాఘ‌వ్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కించిన డాక్యూమెంటరీ బ‌యోపిక్ యాత్ర శుక్ర‌వారం ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది.

తెలుగు రాష్ట్రాల‌తోపాటు, తమిళనాడు,కేరళ, యూఎస్‌లోనూ ఈ సినిమాను విడుద‌ల చేశారు. ప్ర‌ముఖ న‌టుడు మ‌మ్ముట్టి వైఎస్సార్ పాత్ర‌లో న‌టించారు. ఈ సినిమాలో మ‌మ్ముట్టి న‌ట‌న అద్భుతంగా ఉండగా, ప‌లు స‌న్నివేశాలు జ‌న హృదయాలను తాకేలా తెరకెక్కించాడు దర్శకుడు మ‌హి వీ రాఘ‌వ్. ఈ నేప‌థ్యంలో మొద‌టి రోజు క‌లెక్ష‌న్లు వైఎస్సార్ మైలేజీ ఏంటో నిరూపించాయి.

Yatra-Movie-Stills-03

అయితే.. మొద‌టి షో నుంచే అటు అభిమానుల నుంచి ఇటు సామాన్య ప్రేక్షకుడి వరకు పాజిటివ్ టాక్ రావ‌డంతో ముందుముందు వ‌సూళ్లు పెరిగే అవ‌కాశాలు ఉన్నాయ‌ని అంచ‌నా వేస్తున్నారు. ఏపీతోపాటు తెలంగాణ‌, యూఎస్‌లో మొద‌టి రోజు క‌లెక్ష‌న్లు ఎలా ఉన్నాయో చూద్దాం..

నైజాం………………రూ.60లక్ష‌లు
సీడెడ్‌………………రూ.42.3ల‌క్ష‌లు
కృష్ణా……………….రూ.19.16ల‌క్ష‌లు
గుంటూరు………..రూ.46.36ల‌క్ష‌లు
ఈస్ట్‌……………….రూ.9.9ల‌క్ష‌లు
నెల్లూరు………….రూ.17.34ల‌క్ష‌లు
యూఏ……………రూ.14ల‌క్ష‌లు
యూఎస్…………రూ.52ల‌క్ష‌లు

మొత్తం…రూ. 2 .60 కోట్లు వసూలు చేసింది

ఇంకా తమిళనాడు మరియు కేరళ కెలెక్షన్స్ తెలియాల్సి ఉంది.

‘యాత్ర’ ఫస్ట్ డే కలెక్షన్స్
0 votes, 0.00 avg. rating (0% score)

comments



Related Posts


Share
Share