ఒకే దెబ్బకు మూడు పిట్టలను కొట్టిన చిన్నమ్మ

February 17, 2017 at 9:56 am

ఓ సాధార‌ణ సినీన‌టి త‌మిళ‌నాడు రాజ‌కీయాల‌ను రెండున్న‌ర ద‌శాబ్దాలుఆ త‌న క‌నుసైగ‌ల‌తో శాసిస్తుంద‌ని ఎవ్వ‌రూ ఊహించి ఉండ‌రు. ద‌క్షిణాదిలో ఎన్టీఆర్‌-ఏఎన్నార్‌-ఎమ్జీఆర్ వంటి దిగ్గ‌జాల‌తో ఎన్నో హిట్ సినిమాల్లో న‌టించిన ఆమె ఎమ్జీఆర్ మ‌ర‌ణం త‌ర్వాత అన్నాడీఎంకేను త‌న చేతుల్లోకి తీసుకున్నారు. త‌న‌ చాక‌చ‌క్యంతో సీఎం అయ్యి రెండున్న‌ర ద‌శాబ్దాలు త‌మిళ రాజ‌కీయాల్లో ఓ వెలుగు వెలిగిపోయారు.

మ‌రి అమ్మ వెన‌కే ఉన్న చిన్న‌మ్మ‌కు కూడా ఇప్పుడు అదే వ్యూహాత్మ‌క‌త ఒంటిబ‌ట్టిన‌ట్టు ఉంది. తాజా ప‌రిణామాల నేప‌థ్యంలో వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రించి ఆమె త‌న‌ను దెబ్బేసేందుకు కాచుకుని కూర్చొన్న మూడు పిట్ట‌ల ప‌ని ప‌ట్టార‌న్న విశ్లేష‌ణ‌లు వ్య‌క్త‌మ‌వ‌తున్నాయి. శ‌శిక‌ళ సీఎం అయ్యేందుకు ముందు నుంచి కేంద్రంలోని మోడీ స‌ర్కార్‌కు అస్స‌లు ఇష్టం లేదు. చిన్న‌మ్మ సీఎం కాకుండా ఉండేందుకు బీజేపీ స‌ర్వ‌శ‌క్తులు ఒడ్డింది. తెర‌వెన‌క చేయాల్సింది అంతా చేసింది. ప‌న్నీరుకు ఇన్‌డైరెక్టుగా మ‌ద్ద‌తు ఇచ్చింది.

సీఎం అవ్వాల‌న్న శ‌శిక‌ళ కోరిక తీర‌కున్నా ఆమె మాత్రం త‌న మొండి ప‌ట్టుద‌ల‌తో ఒకే దెబ్బ‌కు మోడీ స‌ర్కార్ తో పాటు ప‌న్నీర్ సెల్వం, స్టాలిన్ వ‌ర్గాల ఎత్తుల‌ను చిత్తు చేసింది. ఇక్క‌డ త‌ప్పొప్పుల‌ను మ‌నం విశ్లేషించ‌లేం..రాజ‌కీయాలంటే అంతే మ‌రి. అయితే ప్ర‌స్తుతానికి అయితే శ‌శిక‌ళ‌కే మ‌ద్ద‌తు ఉంద‌ని స్ప‌ష్ట‌మైంది. ప‌న్నీర్ రెబ‌ల్‌గా మార‌డంతో కేంద్రం ఇది మాకు సంబంధం లేదు…అన్నాడీఎంకే ఇంట‌ర్న‌ల్ పాలిటిక్స్ అంటూ తెర‌వెన‌క సెల్వం కోసం చేయాల్సింది అంతా చేసింది. సెల్వం సైతం బీజేపీతో త‌ర‌చూ ట‌చ్‌లో ఉన్నారు.

ఇటు స్టాలిన్ కూడా చిన్న‌మ్మ సీఎం కాకుండా ఉండేందుకు .. సెల్వంకు మ‌ద్దతిస్తామ‌ని ప్ర‌క‌టించారు. ఇలా ఒకే స‌మ‌యంలో కేంద్రం, సెల్వం, స్టాలిన్ ఈ ముగ్గురూ త‌న‌పై ప్ర‌మోగించిన అస్త్రాల‌ను శ‌శిక‌ళ చిత్తుచేసి రాజ‌కీయ వ్యూహంలో అమ్మ‌ను మించిన చిన్న‌మ్మ‌గా నిలిచింది. ఇదే టైంలో శ‌శిక‌ళ ప్లేస్‌లో మ‌రో మ‌హిళ ఉంటే చేతులెత్తేసేదేమో..?  కానీ చిన్న‌మ్మ మాత్రం త‌న రాజ‌కీయ వ్యూహంతో త‌న ప్లాన్ అమ‌లు చేసి ప‌ళ‌నిస్వామిని సీఎం చేసింది.

ఒకే దెబ్బకు మూడు పిట్టలను కొట్టిన చిన్నమ్మ
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share