పళనిస్వామికి షాక్: చిన్నమ్మ టీంలో 30 మంది జంప్

February 16, 2017 at 6:52 am

శ‌శిక‌ళ‌కు సీఎం పోస్టు చేజార‌డంతో అన్నాడీఎంకే సీనియ‌ర్ లీడ‌ర్ సెంగొట్ట‌య‌న్‌కు ఆ ఛాన్స్ వ‌స్తుంద‌ని అంద‌రూ అనుకున్నారు. అయితే అనూహ్యంగా ప‌ళనిస్వామి రేసులోకి వ‌చ్చేశారు. సెంగొట్ట‌య‌న్ కు షాకిచ్చారు. అయితే ప‌ళనిస్వామిని సీఎం చేసే విష‌యంలో అప్పుడే చిన్న‌మ్మ శ‌శిక‌ళ విష‌యంలో లుక‌లుక‌లు ప్రారంభ‌మైన‌ట్టు తెలుస్తోంది. సీఎం సీటు రేసులో ఉన్న ప‌ళ‌నిస్వామి సెంగొట్ట‌య‌న్ కంటే చాలా జూనియ‌ర్‌.

సెంగొట్ట‌య‌న్‌కు ఛాన్స్ వ‌ద్ద‌నుకుంటే ప‌ళ‌నిస్వామి కంటే సీనియ‌ర్లు తంగ‌మ‌ణి, వేలుమ‌ణి ఉన్నారు. కానీ ప‌ళ‌నిస్వామికి ఆ అవ‌కాశం ఇవ్వ‌డంతో సీనియ‌ర్లు ముగ్గురు ఒక్క‌రైపోయార‌ని టాక్. ఆ ముగ్గురూ క‌లిసి ప‌ళ‌నికి షాకిచ్చేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్నార‌ట‌. ఇప్ప‌టికే ఈ ముగ్గురు సీనియ‌ర్లు చాలా మంది ఎమ్మెల్యేల‌తో మంత‌నాలు జ‌రుపుతున్న‌ట్టు తెలుస్తోంది.

అవ‌స‌ర‌మైతే వీరు ప‌న్నీరుసెల్వంతో క‌లిసేందుకు కూడా రెడీ అయిపోతున్న‌ట్టు టాక్‌. ఓవ‌రాల్‌గా 30 మంది ఎమ్మెల్యేల‌ను ఈ ముగ్గురు సీనియ‌ర్లు లాగేస్తార‌ని తెలుస్తోంది. ఈ షాకింగ్ ప‌రిణామాల‌తో చిన్న‌మ్మ వ‌ర్గం త‌ల‌లు ప‌ట్టుకుంటోంద‌ట‌. ఈ ముగ్గురు సీనియ‌ర్ల క‌థ ఇలా ఉంటే మిగిలిన ఎమ్మెల్యేలు ఎవ‌రికి వారు గ్రూపులు క‌ట్టార‌ట‌. త‌మ‌లో ఎవ‌రో ఒక‌రికి మంత్రి ప‌ద‌వి ఇస్తే ఉంటే లేకుంటే సెల్వం గూటికి చేరిపోతామ‌ని బెదిరిస్తున్నార‌ట‌. దీంతో ఆ గ్రూపుల వారీగా వారి కోరిక‌లు తీర్చ‌డానికి శ‌శిక‌ళ టీంకు త‌ల‌కు మించిన భారంగా మారింద‌ని తెలుస్తోంది.

పళనిస్వామికి షాక్: చిన్నమ్మ టీంలో 30 మంది జంప్
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share