అ..ఆ..అంత సీన్ లేదా!పోస్టుమార్టం రిపోర్ట్..

ఆడియో ఫంక్షన్ లో త్రివిక్రమ్ చెప్పింది అక్షర సత్యం.మనం జీవితంలో ఏం చేస్తున్నా,ఎక్కడున్నా అప్పుడప్పుడు వెనక్కి తిరిగి మన మూలాల్ని మనం వెతుక్కునే ప్రయత్నం చేయాలి .కొన్ని జ్ఞాపకాలు మరచిపొవాలనిపించవు,కొన్ని ప్రయాణాలు ఆపలనిపించావు,కొన్ని అనుబూతులు ఎంత పంచుకున్న ఆపాలనిపించవు.స్నేహితులతో కలసి చెప్పుకున్న కబుర్లు,క్రికెట్ ఆడి సరదాగా తిరిగొస్తు త్రాగిన సిగరెట్లు,ఒక టీ కె డబ్బులుంటే ఇద్దరు కలసి హాఫ్ తాగిన రోజులు మరపురానివే .

ఇదంతా ఇప్పుడు మల్లి గుర్తుచేయడానికి ఒక బలమైన కారణం ఉంది.పైన చెప్పినవన్నీ భవిష్యత్తులో వెనక్కి తిరిగి చూసుకుంటే బావుంటాయని చేసినవి కావు. సహజ సిద్దంగా జరిగిన సంగటనలు,అందుకే అవి ఎప్పటికి మధురం.అ…ఆ సినిమా కూడా అలా త్రివిక్రమ్ జర్నీలో ప్లాన్ చేయకుండా చేసుంటే ఇంకోల వుండేదేమో.నా మూలాల్ని నేను వెతుక్కోవాలి కాబట్టి ఒక సినిమా చెయ్యాలి అని తీసే సరికి అందులో సహజత్వం లోపించింది.

పురిజగాన్నాద్ పక్కగా హిట్టే కొట్టేయ్యాలని నవరసాలు రంగరిస్తే పోకిరి సినిమా రాల,మహేష్ బాబుతో “అతడు” లాంటి sensational film కూర్చొని కాచి వడపోస్తే రాలా.వాళ్ళ వాళ్ళ జర్నీలో నాచురల్గ వచ్చిన సినిమాలు.

అసలు సినిమాలో త్రివిక్రమ్ ఏమి చెప్పలకున్నాడో అర్ధం కాదు.పక్కవాళ్ళ సంతోషం కోసం మన సోంత మనుషులను ఇబ్బంది పెట్టకూడదు అనేదే బేస్ పాయింట్ సినిమాకి.అసలు త్రివిక్రమేనా ఈ మాటన్నది అన్న అనుమానం రాక మానదు.మనం బాధపడ్డా పక్కవాళ్ళు బాగుంటే చాలన్నది లోకకల్యాణాన్ని ఇస్తుంది.దీనికి పూర్తి విరుద్దంగా పక్కవాళ్ళ సంతోషం కోసం మన సంతోషాల్ని దూరం చేసుకోకూడదనే స్వార్తమైన ఆలోచన మీద అల్లిన కధే ఈ అ….ఆ.

ఇక ఈ సినిమాలో పాత్రలు ఎప్పుడు ఎలా మారుతాయో ఎవ్వరికి అర్ధం కాదు.హీరో నితిన్,పాపం ఈయనదో కన్ఫుజన్ కారెక్టెర్,అమ్మ మాట వినాలో,అప్పిచ్చినవాడి మాట వినాలో,అత్తకూతురి మాట వినాలో తెలియని అయోమయ కారెక్టెర్ నితిన్ ది.ఇక నరేష్ కారెక్టెర్ కాసేపు పోసిటివగా అనిపిస్తుంది,అంతలోనే రివర్స్ అవుతుంది.కాసేపు భార్యకు భయపడతాడు,వెంటనే లెక్క లేనట్టుంటాడు.రావు రమేష్ గారి కారెక్టెర్ ఈ సినిమాకే హైలైట్.ఈయన కారెక్టర్ మాత్రం మొదటి నుంచి చివరి వరకు ఒకేలా ఉంటది ఒక్క కూతురి విషయంలో తప్ప.అలాంటి డబ్బు మనిషికి కూతురు విషయంలో పిచ్చి వుండటం అంటే అంత ఒప్పెటట్టుగా లేదు.ఇక ఈ సినిమా హీరో సమంతా,ఈ అమ్మాయి తింగారిదో,తెలివయిందో చూస్తున్న మనకే కాదు చేసిన ఆమెకు తీసిన త్రివిక్రంకి అయినా తెలుసో లేదో.చివరిగా నదియ గారు.ఈవిడ కారెక్టర్ రంగులు మార్చకుండా పూర్తి క్లారిటితో ఉంటుంది చివరి వరకు.

సినిమాటిక్ గా చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ అవేరజ్,సెకండ్ హాఫ్ బిలో అవేరజ్.టెక్నికల్ వాల్యూస్,హై standards తో వున్నాయీ.ప్రొడక్షన్ వర్క్ greandior గా ఉంది.మ్యూజిక్ ఆకట్టుకుంది,సినిమాటోగ్రఫీ సింపలి సుపెర్బ్గా ఉంది.దిరేక్షన్ ఆయన సెట్ చేసిన బెంచ్ మర్క్లో లేదు.మాటలు ఐతే అసలు పేలలేదనే చెప్పాలి.

ఈ సినిమాని ఆహా….ఓహో రేటింగ్లతో,సక్సెస్ మీటింగ్లతో అందరూ ఊదర గొట్టేస్తున్నారు.కామన్ ఆడియన్ మాత్రం నిజంగా ఈ సినిమాలో అంత ఆహా…ఓహో అనే అంత ఏముందా అని అనుకుంటున్నా మాట మాత్రం వాస్తవం.