ఆటాడుకుందాం రా TJ రివ్యూ

సినిమా : ఆటాడుకుందాం రా
TJ రేటింగ్: 2/5
టాగ్ లైన్: ప్రేక్షకులతో ఈ ఆటలేంటి
నటి నటులు : సుశాంత్, సోనమ్ బజ్వా, పోసాని కృష్ణ మురళి, బ్రహ్మానందం, వెన్నెల కిశోరె, రఘు బాబు.
నిర్మాత : చింతలపూడి శ్రీనివాస రావు, నాగ సుశీల.
బ్యానర్ : శ్రీ నాగ్ కార్పొరేషన్,
మ్యూజిక్ : అనూప్ రూబెన్స్.
సినిమాటోగ్రఫీ : శివేంద్ర
ఎడిటింగ్ : గౌతమ్ రాజు
డైలాగ్ : శ్రీధర్ సీపాన
కథ/ స్క్రీన్ ప్లే / డైరెక్టర్: నాగేశ్వర రెడ్డి

కాళిదాసు,కరెంట్,అడ్డా అని ఏవేవో సినిమాలు తీసినా ఏది వర్కౌట్ కాలేదు పాపం.ఇక చాన్నాళ్ల గ్యాప్ తీసుకుని అనేక రకాల కథలు విని చివరగా ఓ కథని ఫైనల్ చేసి పక్కాగా గా ప్లాన్ చేసి ఈ ఆటాడుకుందాం రా అనే సినిమా తీశారు.అక్కడికిదేదో బెంచ్ మార్క్ మూవీ అనుకోకండి.ఇది అరిగిపోయిన రీలే..పాత చింతకాయ పచ్చడే.సింపుల్ గా చెప్పాలంటే కలిసుందాం రా సినిమా కి బాద్షా ఫ్లేవర్ ఇవ్వడమన్నమాట.

పాపం సుశాంత్ బాడ్ లక్ ఏంటో గాని అటు కటౌట్ పెద్దది కాదు అలాగని ఫేస్ లో సింగల్ ఎక్స్ప్రెషన్ తప్ప రెండోది పలకాదాయే.ఈ రెంటిలో ఏడున్న సుశాంత్ బాక్గ్రౌండ్ కి ఇన్నిరోజులు హిట్ కోసం వెయిట్ చెయ్యాల్సిన పనిలేదు.అవిలేకనే పాపం సుశాంత్ దండయాత్ర కొనసాగుతూనే ఉండి.ఇది ఇప్పుడప్పుడే ముగిసే దండయాత్రల కూడా కనిపించడం లేదు.

అక్కనేని ఫ్యామిలీని ఓ రేంజ్ లో వాడేశారు ఈ సినిమా మొత్తం.అటు పెద్దాయన నాగేశ్వర రావు గారి దగ్గరినుండి చిన్నప్పటి అఖిల్ వీడియోస్,సుశాంత అమ్మ నాగ సుశీల తో సహా నేటి తరం నాగచైతన్య,అఖిల్ గెస్ట్ అప్పీరెన్స్ ల వరకు వెళ్ళింది వ్యవహారం.కుదరలేదు ఏమో గాని నాగార్జున ఒక్కడే మిస్ అయ్యాడు.అసలు కథనంలో విషయం లేనప్పుడు ఎన్ని గెస్ట్ అప్పీరెన్సులు ఉంటే మాత్రం ఎం లాభం.

పాత కథే అయినా మంచి బేస్ ఉన్న కథ ఇది.ఇద్దరు ప్రాణ స్నేహితులు బిజినెస్ లో ఆకాశమంత ఎత్తుకెదుగుతారు.వారిలో ఒకరు ఇంకొకరిని అపార్థం చేసుకొని మోసగాడిగా చూస్తూ బయటికి గెంటేస్తే ఆ మోసగాడి ముద్రపడ్డ వాడి కొడుకే తండ్రి మీద పడ్డ మచ్చను చెరిపేయడానికి తిరిగి ఆ తండ్రి స్నేహితుడి దగ్గరే చేరి అసలు ఎలా ఆటాడుకున్నాడన్నదే స్టోరీ లైన్.ఇది చాలా ఎమోషన్స్ ఉన్న పాత కథ.అయితే కథనం రక్తికట్టించకపోతే ఎంత బేస్ వున్నా అది తెరపై కనపడదు.ఈ సినిమా విషయం లోను అదే జరిగింది.సినిమా మొత్తాన్ని 2 సినిమాలుగా తీశారు.1st హాఫ్ మొత్తం కలిసుందాం రా టైపు ఫామిలీ ఎమోషన్,కామెడీ ట్రై చేశారు..ఇక సెకండ్ హాఫ్ అయితే బాద్షా డ్రీం మెషిన్ ఎపిసోడ్ ని టైం మెషిన్ గా చేసి నడిపించేసారు.

సుశాంత్ నటన గురించి చెప్పుకునేదేమి లేదు.యాజ్ ఇట్ ఈస్ ఇంతకముందు చూస్తున్నట్టే ఉండి.ఇక హీరోయిన్ నవ్వుతోందో వేరే ఎక్స్ప్రెషన్ ఏదయినా పెట్టిందో అర్థం కాక తల పట్టుకోవాల్సివచ్చింది.అందాలు మాత్రం ఏమాత్రం దాచుకోకుండా బాగానే ఆరబోసింది.బ్రహ్మానందం చాన్నాళ్ల తరువాత ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్ చేసాడు.నిజానికి సెకండ్ హాఫ్ అంతా బ్రహ్మి బేస్ చేసుకునే నడిచిపోతుంది.కామెడీ బాగానే వున్నా ఆల్రెడీ చూసేసిన ఫీలింగ్ రావడం తో అంత ఎఫెక్టివ్ గా లేదు.మిగతా వాళ్లంతా ఎవరెవరి పరిధిలో వాళ్ళు నటించారు.

సాంకేతిక అంశాల గురించి మాట్లాడితే పాటలు పర్లేదు.సుశాంత్ డాన్స్ ఓ మాదిరిగా వున్నా అతని తొందర డాన్స్ ని డామినెటే చేసేస్తోంది.సంగీతం ఇంతక ముందు విన్నట్టే వుంది.స్క్రీన్ ప్లే ఇంకా బాగా వర్కౌట్ చేయాల్సింది.డైలాగ్స్ అక్కడక్కడా బాగున్నాయి.ఓవరాల్ గా కథకి కి తగ్గ కాస్టింగ్ లేదు..స్క్రీన్ప్లే అంతకంటే లేదు.

అన్నపూర్ణా స్టూడియోస్,అక్కినేని ఫామిలీ ఇమేజ్.వాళ్ళ అనునయం నామస్మరణా,గెస్ట్ అప్పరెన్సు లు ఇవన్నీ సినిమాకి ఓ 20 కోట్లు వసూలు చేసే సత్తా ఉంటే ఇన్ 2 కోట్లు అదనంగా వచ్చేలా చేస్తాయేమో కానీ అవే సినిమాని నడిపించలేవు కదా..ఈ విషయం సుశాంత్ కి వాళ్ళ అమ్మగారికి ఎప్పటికి అర్థం అవుతుందో ఏమో.