ఇప్పుడనుకొని ఏమా లాభం జైరాం గారూ!

కాంగ్రెస్ పార్టీ హై కమాండ్ పెద్దల్లో ఒకరైన జయరాం రమేష్ గారిగి పాపం ఇన్నాళ్లకు జ్ఞానోదయం అయినట్టుంది.రాష్ట్ర విభజనతో కాంగ్రెస్ కి జరిగిన నష్టం పూడ్చలేనిది నిట్టూర్చారు పాపం.ఎం చేస్తాం జైరాం గారూ ఎవరు తీసిన గోతిలో వాళ్లే పడతారన్న నానుడి గుర్తుంది గా..అచ్చం అలాగే జరిగినదన్నమాట కాంగ్రెస్ కి.

వైఎస్ఆర్ మరణించకుండా ఉంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పరిస్థులు వేరుగా వుండేయని అన్నారు.అయినా ఈయనకు ఈ నిజం ఇప్పటికి తెలిసిందేమో కానీ వైఎస్ఆర్ మరణించిన తరువాత ఈ మాట అనుకోని తెలుగు వాడు ఉండడేమో.ఇంకా వైఎస్ఆర్ మరణం కేసీర్ కి జీవం పోసిందని అన్నారు..ఇదీ తెలిసిన విషయమే..చంద్రబాబు కేసీర్ ను మంత్రివర్గంలోకి తీసుకునుంటే పరిస్థితి వేరేలా ఉండేదని అరిగి పోయిన హరికథను మళ్ళీ వినిపించారు.

ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విభజన కాంగ్రెస్ సెల్ఫ్ గోల్ గా అభిప్రాయపడ్డారు.మరి ఆటన్నాక గెలుపోటములు సహజమే కదా..స్పోర్టివ్ గా తీసుకోక ఈ నిట్టూర్పులేంటి రమేష్ గారూ?పాపం ఈ పాత తరం పార్టీ నాయకుడు పాతరోజుల్ని నెమరేసుకున్నాడు.అన్ని పార్టీలు లిఖితపూర్వకంగా మద్దతిచ్చాయంటూ పాత రోజులను గుర్తు చేసుకుంటున్నారు.మొత్తానికి ఇప్పుడు ఈయన బాధ ఏంటో ఎవ్వరికి అర్థం కాలేదు.స్పందిచాల్సినప్పుడు చోద్యం చూసి అంతా అయ్యాక నిట్టూర్చడం మన రాజకీయనాయకులకే చెల్లింది మరి.