ఈడు గోల్డ్ ఎహే TJ రివ్యూ

సినిమా : ఈడు గోల్డ్ ఎహే
రేటింగ్: 2.5/5
పంచ్ లైన్: ఈడు 1 గ్రామ్ గోల్డ్ ఎహే

నటీనటులు: సునీల్, సుష్మారాజ్, రిచా పనయ్, జయసుధ, పునీత్ ఇస్సార్, నరేష్, అరవింద్, చరణ్, పృధ్వీ, పోసాని, బెనర్జీ, శత్రు, వెన్నెల కిషోర్.
సంగీతం; సాగర్ ఎం. శర్మ.
సినిమాటోగ్రఫీ: దేవరాజ్.
ఎడిటింగ్: మార్తాండ్ కె.వెంకటేష్
ఆర్ట్: వివేక్ అన్నామలై.
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కిషోర్ గరికిపాటి.
కో-ప్రొడ్యూసర్: అజయ్ సుంకర.
నిర్మాత: రామబ్రహ్మం సుంకర
కథ, స్క్రీన్ప్లే, మాటలు, దర్శకత్వం: వీరు పోట్ల.

సక్సెస్ కోసం సునీల్ చెయ్యని ప్రయత్నం లేదు.కామెడీ ట్రై చేసాడు,ఫామిలీ డ్రామా ట్రై చేసాడు,రెండూ కలిపి కూడా ట్రై చేసాడు .అయినా పాపం ఏది వర్కౌట్ కాలేదు.ఇక లేటెస్ట్ గా మాస్ మసాలా యాక్షన్ జోనర్ ని నమ్ముకున్నట్టుగా కనిపిస్తోంది.ఈ మధ్యనే వచ్చిన జక్కన్నతో చేతులు కాల్చుకున్న సునీల్ ఈసారి ఆ మాస్ మాసాలకి వీరు పోట్ల కామెడీ టచ్ తోడయితే కన్ఫర్మ్ గా సక్సెస్ వస్తుందని వీడు గోల్డ్ ఎహె అని ట్రై చేసాడు కానీ పెద్ద గా వర్కౌట్ అవ్వలేదు.

సునీల్ ఆలోచన అయితే బానే వుంది.వీరు పోట్ల లాంటి కామెడీ,హ్యూమర్ ఉన్న దర్శకుడితో తనకున్న కామెడీ ఇమేజీని జత చేసి కొంచెం మసాలా రంగరిస్తే అన్ని కలిసి అవుట్ ఫుట్ బాగా వస్తుందనుకున్నాడు.అనుకున్నదంతా బాగానే వుంది..విడి విడిగా చూస్తే దర్శకుడి కామెడీ టచ్,సునీల్ యాక్షన్,కామెడీ ఇమేజ్ వేటికవే బాగానే వున్నా అన్ని కలిసే సరికే కలగూరగంపలా వున్నాడీ సునీల్.

మహాదేవ అనేవాడు క్రికెట్ బెట్టింగ్స్ ,స్మగ్లింగ్స్ చేస్తూ అడ్డా దారిలో సంపాదించినా కోట్ల విలువైన డైమండ్స్ లాఫ్ బుద్ధ అనే బొమ్మలో దాస్తుంటాడు.ఆలా దాసిన ఒక్క బొమ్మ తన ఇంటిలోనే ఎవరో తెలియని వ్యక్తి దొంగతనం చేస్తాడు. అప్పటికే సిటీలో దొంగతనాలు చేస్తున్న ఒక్క గ్యాంగ్ కి అప్పుడే హైదరాబాద్ కి ఉద్యోగం కోసం వచ్చిన బంగారాజు కి ఆ దొంగతనం చేసిన వ్యక్తికి సంబంధం ఏంటి అనేదే కధ.కథాపరంగా ఒక సస్పెన్స్ ఎలిమెంట్ క్యారీ అవుతూ చివరి వరకు ప్రేక్షకుల్లో ఒక క్యూరియాసిటీ ని క్రియేట్ చెయ్యాల్సిన స్టోరీ లైన్ ని అంత గ్రిప్పింగ్ గా హేండిల్ చేయలేక పోవడంతో ఆ సస్పెన్స్ కావాల్సిన మోతాదులో కనిపించదు.

సునీల్ ముక్యంగా రెండు విషయాలు ఎంత తొందరగా తెలుసుకుంటే అంత తొందరగా ఈ ఎలాంటి సినిమాలు చెయ్యాలి అనే అయోమయం నుండి బయట పడతాడు.ఒకటి తన బలమేంటి.తన నుండి ప్రేక్షకులు ఏమి కోరుకుంటున్నారు,తాను ఏమేమి చేయగలడు అనేది తెలుసుకోవాలి.ఇక రెండోది ప్రస్తుతం సినీ ఇండస్ట్రీ ఎలా ట్రాన్సఫార్మ్ అవుతోంది.ఇంకా అవే మూస సినిమాలు,మాస్ సినిమాలు అంటూ కాలక్షపం చేస్తూ పోతే వెనక్కి తిరిగి సరిదిద్దు కునే టైం కూడా ఇవ్వదు ఇండస్ట్రీ.ఎన్టీఆర్ లాంటి మాస్ ఇమేజ్ ఉన్న హీరో నే,టెంపర్,నాన్నకు ప్రేమతో,జనతా గారేజ్ అంటూ ఒక దానితో ఒకటి సంబంధం లేని కథలు ఎంచుకుంటూ ప్రయోగాత్మకంగా ముందుకెళ్తున్నాడంటే పరిస్థితి సునీల్ కి ఈ పాటికే అర్థం అయ్యుండాలి.పెళ్లి చూపులు లాంటి చిన్న సినిమాలు కూడా సరికొత్తగా ప్రెసెంట్ చేసి హిట్ కొడుతున్న రోజులివి.ఇంకా సునీల్ ఏ జోనర్ ట్రై చేద్దామా అన్న మీమాంసలోనే ఉంటే చాలా కష్టం.

కామెడీ పరంగా వీరు పోట్ల తన అనుభవాన్నంతా వుపయోగించి బాగా హేండిల్ చేసాడు.పృద్వి,వెన్నెల కిశోరె ల కామెడీ పంచ్ లు బాగానే పేలాయి.మిగతా కమెడియన్స్ ఉన్నంతలో బాగానే నవ్వించారు.మిగతా పాత్రల్లో జయసుధ పెద్దగా స్క్రీన్ టైం లేని,ప్రాధాన్యత కూడా లేని పాత్రలో నిరాశ పర్చింది.విల్లన్ లిస్ట్ చాలా పెద్దదే..అందరూ పర్లేదనిపించారు.హీరోయిన్స్ స్క్రీన్ ప్రెజెన్స్ బాగానే వుంది.పెద్దగా ప్రాముఖ్యత లేని పాత్రల్లో అక్కడక్కడా కొన్ని కొన్ని సీన్స్ లో,పాటల్లో అలా మెరిసి ఇలా వెళ్ళిపోతారు.

టెక్నికల్ విషయాలు మాట్లాడుకుంటే ఏ ఒక్క డిపార్ట్మెంట్ కూడా సూపర్ అనే రేంజ్ లో లేదు.అందరూ పర్లేదు,ఓకే అనే రేంజ్ లో పనిచేశారనిపిస్తుంది.వీరు పోట్ల కామెడీ మీద పెట్టిన ఫోకస్ కథ,కథనం మీద కూడా పెట్టుంటే ఫలితం ఇంకోలా ఉండేది.స్క్రీన్ప్లే అక్కడక్కడా బాగుంది.కథలోని సస్పెన్స్ ఎలిమెంట్ కి ఇంకా గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే తొడయుంటే కథనం మరింత రక్తి కట్టించేది.పాటలు పర్లేదు.కామెడీ పంచ్ లు తప్ప కథలో ఎక్కడా అద్భుతమైన సంభాషణలు కూడా లేవు.

ఓవర్ అల్ గా అన్ని వున్నా అల్లుడి నోట్లో శని అన్న చందంగా సినిమాలో అన్ని ఎలెమెంట్స్ వున్నా అస్త వ్యస్థానంగా డీల్ చెయ్యడంతో పార్ట్శ్ పార్ట్శ్ గా పర్లేదనిపించినా సినిమా మొత్తంగా చూస్తే ఆ ఇంపాక్ట్ కనిపించదు.