కొడాలి నాని కోసం టీడీపీ వేసిన స్కెచ్

వైసీపీ రెబ‌ల్ ఎమ్మెల్యే కొడాలి నానికి చెక్ చెప్పేందుకు టీడీపీ చెక్ చెప్పేందుకు పక్కా స్కెచ్ రెడీ చేస్తోందా? అంటే అవున‌నే అంటున్నారు విశ్లేషకులు! కొన్ని రోజులుగా ఏపీ సీఎం చంద్ర‌బాబుపై నేరుగా విమ‌ర్శ‌లు గుప్పిస్తున్న వైసీపీ నేత‌ల్లో నాని ముందువ‌రుస‌లో ఉంటారు. నేరుగా బాబుతో ఢీ అంటే ఢీ అనే స్థాయిలో త‌ల‌ప‌డుతున్నారు. దీంతో ఆయ‌న‌కు ఎలాగైనా ముకుతాడు వేయాల‌ని చంద్ర‌బాబు తీవ్రంగా ప్ర‌య‌త్నిస్తున్నారు. అయితే కొద్ది రోజులుగా జ‌రుగుతున్న ప‌రిణామాలు చూస్తుంటే.. నాని దూకుడుకు చెక్ చెప్పేందుకు ప‌క్కా స్కెచ్ రెడీ చేశార‌ని తెలుస్తోంది. గుడివాడ‌లో టీడీపీ బ‌లోపేతానికి ఆ పార్టీ వేసిన స్కెచ్‌లు చూస్తుంటే నానికి దిమ్మ‌తిరిగిపోయేలా ఉన్నాయి.

కృష్ణా జిల్లా రాజ‌కీయాలు ఆస‌క్తిక‌రంగా మారాయి. సిట్టింగ్ ఎమ్మెల్యే నాని వ్య‌వ‌హార శైలి.. ఏపీ సీఎం చంద్ర‌బాబుకు త‌ల‌నొప్పిగా మారింది. దీంతో నానికి చెక్ చెప్పాల‌ని చంద్ర‌బాబు, త‌న‌యుడు లోకేశ్ విప‌రీతంగా ప్ర‌య‌త్నిస్తున్న విష‌యం తెలిసిందే! అయితే రోజు రోజుకు గుడివాడ‌లో నాని ప‌ట్టు త‌గ్గుతోందా అన్న సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఈ క్ర‌మంలోనే న‌గ‌రానికి చెందిన ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నను ప్రొటోకాల్‌ ఇన్‌చార్జిగా నియమించడం చర్చనీయాం శ‌మైంది.

గుడివాడలో వైసీపీ త‌ర‌ఫున గెలుపొందిన చైర్మ‌న్ య‌ల‌వ‌ర్తి శ్రీనివాస‌రావును పార్టీలో చేర్చుకుని ఆయ‌న ద్వారా నానికి దెబ్బ‌కొట్టింది. గుడివాడ రూరల్‌ మండలంలో గుత్తా శివరామకృష్ణ(చంటి) తూర్పు కృష్ణా డెల్టా ప్రాజెక్ట్‌ కమిటీ చైర్మన్‌గా ఎంపిక చేసింది. గుడ్ల‌వ‌ల్లేరుకు చెందిన సీనియ‌ర్ నేత సీఎల్‌.వెంక‌ట్రావును స్వచ్ఛ భారత మిషన్‌ వైస్‌ చైర్మన్‌గా నియమించింది. దీంతో గుడివాడ‌లో నాని ప్రాబ‌ల్యం త‌గ్గించేస్తోంది. ఇక గుడివాడ టౌన్‌లో జ‌రుగుతున్న‌ సిమెంట్ రోడ్లు, డ్రైన్ల నిర్మాణాలు, కొత్త మునిసిప‌ల్ భ‌వ‌న ప్రారంభోత్స‌వానికి సీఎం చంద్ర‌బాబే వ‌స్తున్నారు. దీంతో టీడీపీ వేస్తోన్న ఎత్తులతో కొడాలి నాని దిమ్మ‌తిరిగి పోతోంద‌న్న టాక్ వినిపిస్తోంది.