కోడెల కామెడీ:జనం నోటితో నవ్వరు

అనర్హత పిటిషన్లను తిప్పి కొట్టడం ద్వారా ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ స్పీకర్‌ కోడెల శివప్రసాద్‌ వైఎస్‌ఆర్‌ కాంగ్రెసు పార్టీకి పెద్ద షాక్‌ ఇచ్చారట.ఇదే బాబు భజన మీడియా మొత్తం ఊక దంపుడు నిన్నటి నుండి.విడ్డూరానికి ఒక హద్దు పద్దు ఉండాలి.లేకపోతే ఏంటి స్పీకర్ కోడెల ఫిరాయింపు MLA లపై అనర్హత వేటేస్తాడని ఎవ్వరూ అనుకోలేదు.అనుకున్నట్టే పక్కాగా TDP పార్టీ ఆఫీస్ నుంచి వచ్చిన స్క్రిప్ట్ నే ఆయన ఎంచక్కా అసెంబ్లీ లోను బయట ఫాలో అవుతుంటారు.ఇప్పుడూ అదే చేశారు కోడెల. దీనిని వైస్సార్సీపీ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ జీర్ణించుకోలేకపోతున్నారట.అయ్యా మీడియా దిగ్గజ ప్రముఖులారా మీ పచ్చపాతం ఆపండి.

ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించినప్పుడు స్పీకర్‌కే ఫిర్యాదు చేయాలి ఏ పార్టీ అయినాసరే. కానీ మన స్పీకర్ అధికార పార్టీకి తొత్తుగా మారడంతో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు అనర్హత వేటును తప్పించుకుంటున్నారు. అనర్హత వేటు వేయాలని వైఎస్‌ఆర్‌ కాంగ్రెసు పార్టీ పలుమార్లు స్పీకర్‌కి ఫిర్యాదు చేసి, లిఖిత పూర్వకంగా ఆ ఫిర్యాదులు అందించినా, అవి చెత్తబుట్టలోకి వెళ్ళిపోయాయని స్పీకర్‌ వ్యాఖ్యలతో అర్థమవుతుంది. రాజ్యాంగ బద్ధంగా లేని కారణంగా ఆ పిటిషన్లను డిస్మిస్‌ చేసినట్లు కోడెల చెప్పడం పెద్ద హాస్యాస్పదం. కోడెల ప్రతిపక్షం గొంతునొక్కేందుకు చంద్రబాబు కంటే ఎక్కువ అత్యుత్సాహం ప్రదర్శింస్తుంటారనేది జగమెరిగిన సత్యం . అనర్హత వేటు పడితే అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీకి గడ్డు కాలమే. ఆయా స్థానాల్లో తిరిగి ఎన్నికలు జరిగినట్లయితే తెలుగుదేశం పార్టీ అక్కడ గెలిచే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది.పార్టీ ఫిరాయించి ఇప్పటికే అనేక అవమానాలు ఎదుర్కొంటున్న ఫిరాయింపు MLA లకి ఇది కొంచెం ఊరట.