క్రికెట్ ను ఒలింపిక్స్ లో చూడబోతున్నామా!

శ్వక్రీడల్లో క్రికెట్‌ కూడా ఓ భాగం కానుంది. 2024లో రోమ్‌ ఆతిథ్యం ఇవ్వనున్న ఒలింపిక్స్‌లో ఈ మెగా ఈవెంట్‌ నిర్వహణకు బిడ్‌ను దాఖలు చేశారు. ఈ విషయాన్ని ఇటాలియన్‌ క్రికెట్‌ బోర్డు చీఫ్‌ సైమన్‌ గాంబినో వెల్లడించారు. దీన్ని ఐసిసి వార్షిక సమావేశంలో ఖరారు చేసే అవకాశాలున్నాయి. రోమ్‌ ఒలింపిక్స్‌కు ఆతిథ్యం ఇస్తుందని, ఇందులో క్రికెట్‌ను కూడా చేర్చామని, పూర్తి కమిట్‌మెంట్‌తో ఈ నిర్ణయాన్ని ఆర్గనైజింగ్‌ కమిటీ ప్రకటించిందని ఫెడరాయిజన్‌ క్రికెట్‌ ఇటాలియానా (ఎఫ్‌సిఐ) అధ్యక్షుడు గాంబినో పేర్కొన్నారు.

2024 సమ్మర్‌ ఒలింపిక్స్‌కు పారిస్‌, లాస్‌ ఎంజెల్స్‌, బుడాపెస్ట్‌ల వేదికలుగా రోమ్‌ బిడ్‌ దాఖలు చేసింది. ఆతిథ్య నగరం ఐదు క్రీడలను ఒలింపిక్స్‌లో ప్రవేశపెట్టడానికి ఒలింపిక్స్‌ నిబంధనలు అవకాశాన్ని కల్పిస్తున్నాయి. సౌదీ అరేబియాలో ఐసిసి వార్షిక సమావేశంలో 39 అసోసియేటేట్‌ దేశాల సభ్యులతో కూడిన వరల్డ్‌ బాడీ రాటిఫై చేయనుంది. ఇందులో యూఎస్‌ఏ క్రికెట్‌ అసోసియేషన్‌, క్రికెట్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ నేపాల్‌పైన సస్పెన్షన్‌ వేటు వేసే అవకాశం ఉంది. నేపాల్‌, యూఎస్‌ఎ దేశాలు అద్భుతమైన క్రీడా నైపుణ్యం కలిగి ఉన్నాయని, ఐసిసి చైర్మన్‌ శశాంక్‌ మనోహర్‌ తెలిపారు.