‘ఖైదీ నెం.150’ రిలీజ్ డేట్ చెప్పేసాడు

మెగా అభిమానులకు శుభవార్త. చిరంజీవి నటిస్తున్న 150వ చిత్రం ఖైదీ నెం.150 రిలీజ్ డేట్ పై ఆ సినిమా దర్శకుడు వి.వి వినాయక్ స్పష్టత ఇచ్చేసారు.రాజమండ్రిలోని టి.నగర్, పుష్కరఘాట్ గణేష్ మండపాలను సందర్శించిన వి.వి వినాయక్ ‘ఖైదీ నెం.150’ వచ్చే బోగి పండుగ రోజున విడుదల కాబొతోందని చెప్పారు. . ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. సినిమా షూటింగ్ 60 శాతం పూర్తయ్యిందని, వచ్చే ఏడాది భోగి పండగ రోజు చిత్రం విడుదల చేస్తామని క్లారిటీ ఇచ్చారు. అలాగే జనతా గ్యారేజ్‌తో ఎన్టీఆర్ భారీ హిట్‌ కొట్టడం సంతోషంగా ఉందని వి.వి. వినాయక్ అన్నారు.