చిరును లైన్లో పెడుతున్న చంద్ర‌బాబు

ఏంటి స‌ర్‌ప్రైజింగ్‌గా ఉందా?  చిరు ఏంటి? చ‌ంద్ర‌బాబు ఆయ‌న‌ను లైన్‌లో పెట్ట‌డం ఏంట‌ని ఆలోచిస్తున్నారా?  పాలిటిక్స్ అంటే అవేగామ‌రి! ఎప్పుడు ఎవ‌రిని దువ్వాలో ఎప్పుడు ఎవ‌రిని రువ్వాలో అనే స‌బ్జెక్ట్ పాలిటిక్స్‌లో పెద్ద ట్రిక్‌. రానున్న 2019 ఎన్నిక‌ల్లో మ‌రోసారి గెలుపు గుర్రం ఎక్కి ఏపీ పాల‌న‌ను సుస్థిరం చేసుకోవాల‌ని చంద్ర‌బాబు ప‌క్కా ప్లాన్‌తో ఉన్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో ఆయ‌న ఇప్ప‌టి నుంచే త‌న ప్లాన్‌ను అమలు చేసేందుకు రెడీ అయిపోతున్నారు. వాస్త‌వానికి టీడీపీలో చంద్ర‌బాబు త‌ర్వాత బ‌ల‌మైన నేత ఎవ్వ‌రూ లేరు. ఆయన వియ్యంకుడు బాల‌య్య ఉన్నా బాల‌య్య సినిమాలు, హిందూపురానికే ప‌రిమితం.

ఈ క్ర‌మంలో బాబుకు ఓ బ‌ల‌మైన నేత అవ‌స‌రం ఉంది. అయితే, 2014లో త‌న వెంట తిరిగి ప్ర‌చారం చేసిన జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. వ‌చ్చే ద‌ఫా ఎన్నిక‌ల్లో బాబు వెనుక న‌డుస్తార‌నే గ్యారెంటీ లేదు! ఆయ‌న ఒంట‌రిగా లేదా వామ‌ప‌క్షాల‌తో జ‌త‌క‌ట్టి బ‌రిలోకి దిగినా దిగొచ్చు. ముఖ్యంగా ప‌వ‌న్ ఇప్పుడు హోదా కోసం పోరాడుతున్నారు. కానీ, బాబు ఆ హోదా అక్క‌ర్లేద‌ని ఇప్ప‌టికే స్ప‌ష్టం చేశారు. ఈ క్ర‌మంలో ఇద్ద‌రూ క‌లిసి 2019లో ఎన్నిక‌ల‌కు వెళ్తార‌ని చెప్ప‌లేం. కాబ‌ట్టి బాబుకు ప్ర‌త్యామ్నాయ నేత అవ‌స‌రం ఉంది. అంతేకాకుండా సినీ గ్లామ‌ర్ కూడా క‌లిసి వ‌స్తేనే త‌న క‌ల నెర‌వేరుతుంద‌ని ఆయ‌న గ‌ట్టిగా న‌మ్ముతున్నారు.

ఈ క్ర‌మంలోనే ఆయ‌న కాంగ్రెస్ నేత, ఎంపీ చిరంజీవిని లైన్‌లో పెడుతున్నార‌నే వార్త‌లు వ‌స్తున్నాయి. ఆయ‌న‌ను లైన్‌లో పెట్ట‌డం వ‌ల్ల బాబుకి వెంట వెంట‌నే రెండు ప్ర‌యోజ‌నాలు ఉన్నాయ‌ని చెబుతున్నారు. ఒక‌టి ఓ సినీ గ్లామ‌ర్‌తో కూడుకున్న రాజ‌కీయ నేత‌తో పాటు, త‌న‌పై కారాలు మిరియాలు నూరుతున్న కాపు సామాజిక వ‌ర్గాన్ని శాంతింప జేసేందుకు ఓ కాపు నేత ల‌భిస్తాడ‌ని బాబు భావిస్తున్నార‌ట‌. ఈ క్ర‌మంలో ఇప్ప‌టి నుంచే చిరును లైన్‌లో పెడుతున్న‌ట్టు తెలుస్తోంది. దీనిలో ఫ‌స్ట్ స్టెప్‌గా చిరు కుమారు రాం చ‌ర‌ణ్‌కి చెందిన ట్రూజెట్ విమాన సంస్థ‌ను న‌ష్టాల నుంచి బ‌య‌ట‌కు తెచ్చేందుకు య‌త్నిస్తున్నార‌ట బాబు. ప్ర‌స్తుతం ప్ర‌యాణికులు లేక ఈ సంస్థ ఈగ‌లు తోలుకుంటోంద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి.

దీంతో రెండు ద‌ఫాలుగా ప్ర‌భుత్వ ల‌య‌బిలిటీ ఫండ్ నిబంధ‌న‌ల ప్ర‌కారం రూ.10 కోట్ల వ‌ర‌కు బాబు స‌మ‌కూర్చార‌ట‌! ఈ విధంగా చిరుకు ద‌గ్గ‌ర‌వ్వాల‌ని భావిస్తున్నార‌ట‌. ఆయ‌నే వ‌స్తే… త‌నకు ఖ‌చ్చితంగా గెయిన్ ఉంటుంద‌ని బాబు యోచిస్తున్నార‌ట‌. మ‌రి ఇది ఎంత‌వ‌ర‌కు స‌క్సెస్‌ అవుతుందో  చూడాలి. ఇక‌, చిరు వైపు నుంచి చూస్తే.. ఆయ‌న‌కు కూడా కాంగ్రెస్‌లో ప‌రిస్థితి ఏమంత బాగోలేదు. ఏపీలో పుంజుకుంటుందో లేదో తెలియ‌ని హ‌స్తం పార్టీని ప‌ట్టుకుని ఊగిస‌లాడే కంటే ఫాంలో ఉన్న పార్టీలోకి జంప్ చేస్తే బాగుంటుంద‌ని ఆయ‌న స‌న్నిహితులు ఆయ‌న‌కు పొలిటిక‌ల్ స‌ల‌హాలు ఇస్తున్నారంట. అయితే, సోద‌రుడి పార్టీ జ‌న‌సేన‌లోకి వెళ్లే యోచ‌న త‌న‌కు లేద‌ని ఆయ‌న వారి వ‌ద్ద చెప్పారట‌. ఈ క్ర‌మంలో బాబు బ‌ల‌వంత పెడితే.. త‌ప్ప‌కుండా సైకిల్ ఎక్కే ఛాన్స్ ఉంద‌ని వినిపిస్తోంది. సో.. ఇదీ.. చిరు.. బాబుల పొలిక‌ల్ ఫ్యూచ‌ర్ ప్లాన్స్‌. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలంటే వెయిటింగ్ త‌ప్ప‌దు!