చుట్టాలబ్బాయి TJ రివ్యూ

సినిమా : చుట్టాలబ్బాయి
టీజ్ రేటింగ్: 2.75/5
టాగ్ లైన్: రొటీనే కానీ బొర్ కొట్టదు
నటి నటులు : ఆది,నమిత ప్రమోద్, సాయి కుమార్జ,అలీ,పృద్వి, జయ ప్రకాష్ రెడ్డి, పోసాని కృష్ణ మురళి, బ్రహ్మానందం, కృష్ణ భగవాన్,
నిర్మాత : వెంకటేష్ తలారి
బ్యానర్ : శ్రీ ఐశ్వర్య లక్ష్మి మూవీస్,
మ్యూజిక్ : థమన్
సినిమాటోగ్రఫీ : అరుణ్ కుమార్
ఎడిటింగ్ : SR సేక్ఖార్
డైలాగ్ : భవాని ప్రసాద్
కథ /స్క్రీన్ ప్లే/డైరెక్టర్: వీరభద్రం చౌదరి

సాయికుమార్ వారసుడుగా టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన ఆది కేవలం ఏడు సినిమాలతోనే ఇండస్ర్టీలో టాక్ ఆఫ్ ది టౌన్ అయిపోయాడు. ఇంతక ముందు వచ్చిన గరం సినిమా ప్లాఫ్ తరువాత “చుట్టాలబ్బాయి” సినిమాతోనైనా హిట్ కొట్టాలని పట్టుదలతో ఉన్నాడు.స్టార్ హీరో నాగార్జునతో “భాయ్ ” సినిమా డైరెక్టర్ వీరభద్రం , వెంకట్ తలారి ఈ సినిమాను భారీ బడ్జెట్తో నిర్మించారు. భారీ అంచనాల మధ్య ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఆదికి క్లుప్తంగా కం బ్యాక్ మూవీ అని చెప్పఁపొచ్చు.

చుట్టాలబ్బయి స్టోరీ :

స్టోరీ విషయానికి వస్తే రొటీన్ స్టోరీ అయినా ప్లాష్ బ్యాక్,పెద్దగా ట్విస్ట్ లేకుండా స్ట్రైట్ స్టోరీ తో దర్శకుడు కథని నడిపించాడు .పెళ్లంటే ఇష్టంలేని అమ్మాయికి పెళ్లి చేస్తాను అనే అన్న దగ్గర నుండి పారిపోతున్న అమ్మాయికి అంతకుముందే చిన్న పరిచయం ఉన్న అబ్బాయి ఆ అమ్మాయికి ఏ విధంగా సహాయం చేస్తూ ఆ అమ్మాయికి ప్రేమతో ఎలా చేరువ అయ్యాడు అన్నదే స్టోరీ . దీనికి అనేక ఊహించని మలుపులని కథకి జోడించి దర్శకుడు ఆసక్తికరంగా చిత్రీకరించాడు.

విశ్లేషణ :

రొటీన్ స్టోరీలోఆదిని ఫ్రెష్ లుక్ తో పరిచయం చేసాడు దర్శకుడు. ప్రథమార్ధం మొత్తం మెయిన్ స్టోరీ చెప్పకుండా కామిడీయన్స్ తో నడిపాడు.ఇంటర్వెల్ ట్విస్ట్ బాగుంది. ఆది తనపాత్రలో న్యూ షేడ్స్ లేకపోయినా పాత్ర వరకు బాగానే చేసాడు .హీరోయిన్ నమిత ప్రమోద్ (తోలి పరిచయం ) కథ మొత్తం తనచుట్టే తిరుగుతుంది .హీరోయిన్ పాత్రలో నమిత ప్రమోద్ తనకు తోలి సినిమానే అయినా అందం గా సాంప్రదాయ పద్దతితో చక్కటి నటన కనబర్చింది.మిస్టర్ ఇగో పాత్రలో పృద్వి కామెడీ తో సినిమా మొత్తాన్ని అలరించాడు. పోసాని సహాయ నటుడిగా హాస్యనటుడిగా బాగా స్థిరపడిపోయారు.ఈ మధ్య పోసాని లేని సినిమా లేదంట ఆశర్యం లేదు.ఈ సినిమాలో కూడా మరో సారి అలరించాడు.ఇక సాయి కుమార్ గెస్ట్ రోల్ లో కనిపించినా ఆది కథలో కీలకమైన పాత్ర కావడం తో సాయికుమార్ స్క్రీన్ పై కనిపించింది కాసేపే అనే ఆలోటు తెలీదు మనకు.

మొత్తం గా సినిమా కథ పాతదే అయినా దర్శకుడు కథని నడిపిన తీరు మెచ్చుకోవాల్సిందే.స్క్రీన్ప్లే బాగుంది.థమన్ బాక్గ్రౌడ్ మ్యూజిక్,పాటలు సినిమాకి అదనపు బలాన్నిచ్చాయి.ఆది ఎప్పటిలాగే డాన్స్ లో తన మార్క్ ఈజ్ చూపించాడు.ప్రొడక్షన్ వాల్యూస్ పెద్ద హీరో సినేమానా అనేంత రేంజ్ లో వున్నాయి.దానికి ప్రొడ్యూసర్స్ ని మెచ్చుకోవాల్సిందే.సినిమాటోగ్రఫీ సినిమా మూడ్ ని బట్టి చక్కగా కుదిరింది.కామెడీ పంచ్ లు బాగానే పేలాయి.

ఫైనల్ గా ఇదీ రొటీన్ సినిమానే అయినా కామెడీ, డైరెక్టర్ క్రియేటివిటీ , కథని నడిపిన తీరు సినిమాను రెగ్యులర్ సినిమా నుండి వేరే రేంజ్ కు తీసుకెళ్లామని చెప్పొచ్చు.