జగపతిబాబు హాలీవుడ్ ఎంట్రీ అదిరింది

క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన జగపతిబాబు హీరోలకి దీటుగా దూసుకుపోతున్నారు.లెజెండ్,శ్రీమంతుడు లాంటి సినిమాలు జగపతిబాబుకున్న డిమాండ్ ని అమాంతం పెంచేసాయి.దానికి తగ్గట్టుగానే జగ్గు భాయ్ కూడా చాలా జాగ్రత్తగా పాత్రలను ఎంచుకుంటూ ముందుకు దూసుకుపోతున్నాడు.తెలుగు హీరోలకి ఏమాత్రం తీసిపోని రేంజ్ లో జగ్గు ఇమేజ్ మళ్ళీ వచ్చేసిందంటే అతిశయోక్తి కాదు.

ఇక తాజాగా జురాసిక్ పార్క్ , జాస్, ఇండియానా జోన్స్ వంటి అద్భుతమైన చిత్రాల రూపకర్త స్టీవెన్ స్పిల్బర్గ్ దర్శకత్వం లో వస్తోన్న అద్భుతమైన ఫాంటసి చిత్రం, ది బి ఎఫ్ జి (ది బిగ్ ఫ్రెండ్లీ జయంట్). డిస్నీ మరియు రిలయన్స్ ఎంటర్టైన్మెంట్స్ నిర్మించిన ఈ చిత్రాన్ని జులై 15 న దేశ వ్యాప్తం గా రిలయన్స్ వారు విడుదల చేయనున్నారు.

ఒక ఫ్రెండ్లీ మహాకాయుడికి ఒక చిన్న పిల్లకి మధ్య జరిగే ఒక అద్భుతమైన కథను స్టీవెన్ స్పిఎల్బర్గ్ అత్యుత్తమ సాంకేతిక పరిజ్ఞానం తో తెరకెక్కించారు. ప్రముఖ తెలుగు నటుడు జగపతి బాబు ఈ చిత్రం లో ని ప్రధాన పాత్రకు డబ్బింగ్ చెప్పటం విశేషం. ఆయన ఒక పాత్రకు డబ్బింగ్ చెప్పటం ఇదే ప్రధమం. ప్రస్తుతం ఆయన అమెరికా పర్యటన వున్నారు.