జయలలిత మరణంపై ఎన్నో సందేహాలు

జయలలిత మరణం తరువాత ప్రజలలో ఎన్నో సందేహాలు, అంతుపట్టని ప్రశ్నలు వెలుగు లోకి వస్తున్నాయి. వాటిలో భాగంగా జయలలిత మరణం సహజ మరణం కాదని, తన నమ్మిన బంటు అయిన శశికళ జయ హత్యకు కుట్ర పన్నారు అని వినికిడి. వాటిలో నిజం ఎంత వరకు ఎవరికీ తెలియదు, అలాగే ఆసుపత్రిలో చికిత్స తీసుకున్న 75 రోజులు జయ సొంత వారిని కుడా చూడనియ్యకుండా శశికళ అంత తానే అన్నట్టుగా వ్యవహరించింది అన్న వాదనలు వినిపిస్తున్నాయి.

ఇది ఇలా ఉంటే అమ్మతో నన్ను మాట్లాడనివ్వకుండా చేసారని, ఆసుపత్రిలో జయ ఉన్నప్పుడు నేను మూడు సార్లు కలవడానికి వెళ్ళాను కానీ శశికల ఒక్కసారి కూడా నన్ను చూడనివ్వలేదని పేర్కొంది.. జయలలిత చెల్లి కూతురు అయిన అమృత ప్రస్తుతం ఆమె బెంగళూరులో నివసిస్తుంది. అలాగే అమ్మ ఆస్తులు తమిళనాడు పేద ప్రజలకు దక్కాలి, అప్పుడే అమ్మ ఆత్మకు శాంతి చేకూరుతుంది అని అమృత వెల్లడించింది. అమ్మ ఆస్తి కోసం శశికళ పన్నాగం పన్నుతున్నారని ఆమె ఆరోపణలు చేసారు.

అలాగే జయలలిత మృతదేహం రాజాజీ హాల్లో ఉన్నపుడు శశి కల కుంటుంబ సభ్యులే ఉన్నారని ..ఆమె మృతదేహం వద్దకు కొంత మంది వీఐపీ లను తప్ప ఎవరిని రానివ్వలేదని ఆరోపణులు వస్తున్నాయి. ఇది వరకు ఒకసారి అమ్మపై కుట్రపన్నుతున్నారు అన్న ఆరోపణ మీద శశి కల ఆమె కుటుంబ సభ్యులు అమ్మచే బహిష్కారించ బడ్డారు, కొన్ని నెలలు తరువాత మల్లి పార్టీలోకి తీసుకున్న ఆమె కుటుంబ సభ్యులను ఎవరిని అమ్మ దగ్గరికి రానివ్వలేదు. ఆసమయంలో శశి కల పై అమ్మ అంత ఫైర్ అవడానికి కారణం ఎవరికీ తెలియదు, ఇలాగే మరెన్నో ప్రశ్నలు తమిళనాట ప్రజలను సందేహాలతో కలిచివేస్తున్నాయి.