తిక్క TJ రివ్యూ

సినిమా: తిక్క
టాగ్ లైన్ :  ఈ తిక్కకి లెక్క లేదు
TJ రేటింగ్: 1/5

నటీ నటులు: సాయిధ‌ర‌మ్ తేజ్‌, లారిస్సా బోనాసి, రాజేంద్ర‌ప్ర‌సాద్‌, స‌ప్త‌గిరి, వెన్నెల కిషోర్‌, తాగుబోతు ర‌మేష్…
నిర్మాత: రోహిన్ కుమార్ రెడ్డి
బ్యానర్: శ్రీ వెంక‌టేశ్వ‌ర మూవీ మేక‌ర్స్‌
మ్యూజిక్: ఎస్ఎస్‌.థ‌మ‌న్‌
సినిమాటోగ్రఫీ: కెవి.గుహ‌న్‌
ఎడిటింగ్ : కార్తీక శ్రీనివాస్‌
స్టోరీ /స్క్రీన్ ప్లే/డైరెక్టర్ : సునీల్ రెడ్డి

ఈ మధ్యకాలం లో సినిమా టైటిల్ కి కథకి అసలు సంబంధమే ఉండటం లేదు.ఆ లోటు ఈ తిక్క సినిమా తో పూర్తిగా తీరిపోయింది.ఇదో పెద్ద తిక్క సినిమా రా బాబు అనే టైటిల్ తోనే పాపం దర్శకుడు చెప్పేసాడు.తిక్క అంటే అలాంటి ఇలాంటి తిక్క అనుకునేరు..ఈ తిక్కకి అసలు లెక్కే లేదు..ఎదో కిలోలు..క్వింటాల్లో అనుకునేరు ..ఏకంగా టన్నుల్లో తిక్కని నింపేశారు సినిమా మొత్తం.

వరుస హిట్స్ తో మంచి ఊపుమీదున్న సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ కి ఈ సినిమాతో తిక్క మొత్తం వదలడం ఖాయం..తిక్క తిక్కగా సినిమాలు సెలెక్ట్ చేసుకుంటే రిజల్ట్ ఎలా ఉంటుందో ఈ తిక్క సినిమా సాయి కి రుచి చూపిస్తుంది.అసలు ఈ సినిమా ఎలా ఒప్పుకున్నాడో తెలీదు.ఎదో దర్శకుడ్ని నమ్మి ఒప్పుకున్నాడనుకున్న పాపం నిర్మాతల్ని చూస్తే జాలేస్తుంది..ఎదో ఆకతాయి తనంగా నిర్మాత డబ్బులు ఖర్చు పెట్టించడానికో సినిమా తీసాడు దర్శకుడు అనిపిస్తుంది.

కథ గురించి చెప్పడానికేమి లేదు..అసలు ఇందులో కథే లేదు..జులాయిగా తాగుతూ తిరుగుతూ వుండే హీరో కి హీరోయిన్ తొలి చూపులోనే తిక్క తిక్కగా నచ్చేసి ప్రేమలో పడితే..హీరో తండ్రి తో కలిసి తాగుతూ తిరుగురుతు జీవితం లో తిక్క తిక్కగా వుండే హీరో ని వాటన్నిటినుండి దూరం చేస్తుంది హీరోయిన్.అయితే మళ్ళీ తిక్క తిక్క ట్విస్ట్స్ తో వీళ్లిద్దరు విడిపోవడం కలవడం అంతా పెద్ద తిక్క పంచాయితీ.

సాయి ధరమ్ తేజ్ దీని నుండి ఎంత తొందరగా గుణపాఠం నేర్చుకున్తే అంత మంచిది.ఇక హీరోయిన్స్ గురించి చెప్పుకోవడానికేమి లేదు.సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ హీరో కి త్తండ్రి గా అసలు అంత డీగ్రేడెడ్ పాత్రని ఎందుకు ఒప్పుకున్నాడో అర్థం కాలేదు.ఇక సినిమాలో అలీ..తాగుబోతు రమేష్ ..సప్తగిరి..వంటి కమెడియన్స్ వున్నా నవ్వు తెప్పించే సన్నివేశాలు మాత్రం మచ్చుకైనా కనిపించవు.

ఇక ఈ సినిమా పాటలు రిలీజ్ అయ్యాక సినిమా భవిష్యత్ సగం అర్థం అయింది.అంత సెకండ్ గ్రేడ్ సంగీతాన్ని జొప్పించారు ఈ తిక్కలో.ప్రొడ్యూసర్ ని మాత్రం బాగా వాడేసాడు డైరెక్టర్.ఇక స్క్రీన్ ప్లే గురించి మాట్లాడటం అనవసరం.ఎడిటింగ్ అని..ఆర్ట్ డైరెక్షన్ అని మిగతా టెక్నికాలిటీస్ జోలికెళ్లకపోవడమే బెటర్ .

ఎదో చూసాము కాబట్టి రివ్యూ రాయడమే తప్ప..ఇంత తిక్క సినిమాకి రివ్యూ రాయడం కూడా దండగే..లేకపోతే తండ్రి కొడుకుల అనుబంధం..ఇద్దరు ప్రేమికుల ప్రేమ..సేహుతుల స్నేహం..లాంటి మానవీయ కోణాల్ని కూడా తిక్క గా చూపిస్తే రిజల్ట్ ఇదిగో ఈ తిక్కే సమాధానం.