నిహారిక కోసమైనా పవన్ వస్తాడా?

అమ్మాయే అయినా చిచ్చరపిడుగే ఈ కొణిదెలవారమ్మాయి. తొలి సినిమా కోసం విపరీతమైన పబ్లిసిటీ చేసుకుంటోంది. హీరోయిన్‌గా మెగా ఫ్యామిలీ నుంచి వస్తున్న తొలి అమ్మాయి నిహారిక మాత్రమే. హీరోయిన్‌గా నటించాలన్న తన ఆకాంక్షను బయటపెట్టాక, ఫ్యామిలీ ఇచ్చిన సపోర్ట్‌ని ఎప్పటికీ మర్చిపోలేనని చెబుతూ, కుటుంబానికి చెడ్డపేరు తెచ్చే సినిమాలు మాత్రం చేయనని భరోసా ఇస్తోంది నిహారిక అభిమానులకి. ఇంకో వైపున పబ్లిసిటీ పరంగా నిహారిక తీసుకుంటున్న జాగ్రత్తలకు మెగా ఫ్యామిలీ ఆశ్చర్యపోతోందట. మెగా అభిమానుల్లో ప్రత్యేకించి మహిళా అభిమానుల్ని పిలిపించుకుని, వారితో ముచ్చటించి, వారి ఆశీస్సులు అందుకున్న నిహారిక, త్వరలో సినిమా విడుదలకు సిద్ధమవుతుండడంతో మెగా ఫ్యామిలీలో ఒక్కొక్కర్నీ ఒక్కో విధంగా మీడియా ముందుకు తీసుకురానుందట.

నాగబాబు, వరుణ్‌ రెడీగానే ఉన్నారు. చరణ్‌, అల్లు అర్జున్‌ కూడా ఓకే. చిరంజీవిని, పవన్‌కళ్యాణ్‌ని తీసుకురావడమే కొంచెం కష్టం. చిరంజీవి వచ్చేసినా, బాబాయ్‌ పవన్‌కళ్యాణ్‌ టైమ్‌ దొరకడం ఎవరికైనా కష్టమే. అయితే నిహారికకి బాబాయ్‌ నుంచి ఫుల్‌ సపోర్ట్‌ ఉందట. రైట్‌ టైమ్‌లో పవన్‌కళ్యాణ్‌ నిహారిక తొలి సినిమా ‘ఒక మనసు’ పబ్లిసిటీ కోసం రానున్నాడని సమాచారమ్‌.అసలే పవన్ కళ్యాణ్ తన సోంత ఫామిలీ ఫంక్షన్ కి దూరంగా ఉంటున్నాడు.సాక్షాత్తు చిరంజీవి 60 వ పుట్టినరోజు వేడుకలకి కి రాక పోయే సరికి నాగబాబు పబ్లిక్ గానే పవన్ వ్యవహార శైలి పైన ఫైర్ అయ్యాడు.ఇప్పుడు నాగబాబు కూతురు నిహారిక విషయం లో పవన్ ఎలా స్పందిస్తాడో చూడాలి మరి. ఇదిలా ఉండగా నిహారిక, తనకు తన తండ్రి నాగబాబు కొనిచ్చిన ఆడి కారుతో ఫొటోకి పోజులిస్తూ ఆ ఫొటోని సోషల్‌ మీడియాలో పెట్టింది. నిహారికకి నాగబాబు ఆడీ కారుని గిఫ్ట్‌గా ఇచ్చారట.