నెహ్రూ దేనికీ పాకులాట?

తెలుగు ప్రజలంతా గర్వించదగ్గ నటుడు,నాయకుడు అయిన ఎన్టీఆర్ కి సన్నిహితుడుగా ముద్రపడ్డ దేవినేని రాజశేఖర్( నెహ్రు )టీడీపీ తీర్థం పుచ్చుకొవడం దాదాపుగా ఖరారైంది.ఈ మేరకు ఆయన కుమారుడు దేవినేని అవినాష్ తో కలిసి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుని కలుసుకున్నారు. సెప్టెంబర్ 9 వ తేదీన అధికారికంగా సైకిల్ ఎక్కాయనున్నారు తండ్రి కొడుకులు.

రాజకీయాల్లో బద్ద శత్రువులుండరు అనడానికి నిదర్శనం దేవినేని..ఎవరెన్ని పార్టీలు మారినా దేవినేని మాత్రం టీడీపీ వైపు తొంగి కూడా చూడడు అనుకునేవారు అందరూ.దేవినేని కూడా ఇన్నేళ్లు అలాగే వ్యవహరించాడు.రాజకీయ అవసరాలు,కుమారుడి భవిష్యత్తు ఒక్క సారిగా గుర్తొచ్చాయి ఏమో..నమ్మిన సిద్ధాంతాలు..విలువలు అన్ని కట్టి కబ్ బోర్డు లో పెట్టేసి సైకిలెక్కేందుకు తయారయ్యారు.

దేవినేని 1980 ప్రాంతం లో విజయవాడ రాజకీయాల్లో చక్రం తిప్పారు..ఆ హవాతోనే ఎన్టీఆర్ గారు పార్టీ లోకి ఆహ్వానించారు..అనతికాలంలోనే నెహ్రు ఎన్టీఆర్ కి ప్రియ శిష్యుడయ్యాడు.అన్నగారి పై అభిమానం తో వెన్నుపోటు పథకానికి చంద్రబాబుతో చెయ్యి కలపకుండా స్వచ్ఛమైన తన అభిమానాన్ని చాటుకున్నాడు.అయితే ఎన్టీఆర్ మరణానంతరం 1997 లో వైస్ రాజశేఖర రెడ్డి పిలుపు మేరకు కాంగ్రస్ పార్టీ లో చేరారు.

అయితే అవకాశం వచ్చిన ప్రతి సారి చంద్రబాబు మోసపూరిత వైఖరిని ఎండగడుతూనే వచ్చాడు నెహ్రు.కొన్ని సార్లు ఎన్టీఆర్ గారికి చంద్రబాబు చేసిన అవమానం తలచుకుని నెహ్రు కన్నీటి పర్యంతం అయినా సందర్భాలూ వున్నాయి.అయితే రాజకీయ చదరంగం లో నెహ్రు నేను కూడా ఓ సామాన్య అవకాశవాద రాజకీయనాయకుడినే అని టీడీపీ లో చేరికతో చెప్పకనే చెప్పాడు.

పాపం టీడీపీ నుండి ఏమి ఆశించడం లేదన్నాడు నెహ్రు..నువ్వు ఆశించినా..ఆశల పల్లకి ఎక్కినా..టీడీపీ లో నీకేం బ్రహ్మరథం పట్టబోరన్నది జగద్విగితం.ఇన్నాళ్లకు సొంతింటికొచ్చినట్టుందా..ఛీ ఛీ ..అంటే ఇన్నాళ్లు అత్తారింట్లో ఉండి సొంతింటి వాళ్ళని ఆడిపోసుకున్నావా..నరం లేని నాలుక ఏదయినా మాట్లాడిస్తుందన్నట్టు..విలువలు వదిలేసినా రాజకీయ నాయకుడు కూడా అంతే.