బాలకృష్ణ కోసం 1000 మంది సైనికులు, 300 గుర్రాలు, 20 రథాలు

నందమూరి నటసింహం బాలకృష్ణ 100 వ చిత్రంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి శరవేగంగా చిత్రీకరణను జరుపుకుంటుంది.ఇప్పటికే మొరాకోలో మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకుంది.అక్కడ యాక్షన్ పార్ట్‌ను చిత్రీకరించారు.తర్వాత సెకండ్ షెడ్యూల్‌ను హైదరాబాద్ చిలుకూరు సమీపంలో వేసిన భారీ యుద్ధనౌక సెట్‌లో షూట్ చేశారు.

తాజాగా జార్జియాలో క్లైమాక్స్ చిత్రీకరణ జరుపుకుంటోంది ఈ హిస్టారికల్ సినిమా.ఈ భారీ షెడ్యూల్‌లో శాతవాహన సైనికులకు, గ్రీకు సైనికులకు మధ్యజరిగే పోరాట సన్నివేశాలుంటాయట.కాగా ఈ షూటింగ్ జార్జియాలో మౌంట్ కజ్ బెగ్ పర్వతం వద్ద చిత్రీకరిస్తున్నారు.ఈ ప్రాంతం రష్యాకు చాలా దగ్గరగా ఉంటుంది. 1000 మంది సైనికులు, 300 గుర్రాలు, 20 రథాలతో క్లైమాక్స్ ను భారీగా చిత్రీకరించబోతున్నట్టు సమాచారం.బాలయ్య మరో రెండురోజుల్లో ఈ షూటింగ్ లో పాల్గొనబోతున్నారు.

ఇప్పటికే ఈ సినిమాపై అభిమానులు అంచనాలు అమాంతం పెరిగిపోయాయి.ఇక ఇంత భారీ రేంజ్ లో బాలయ్య యుద్ధ సన్నివేశాలు అనడంతో సినిమా ఇంకేస్థాయిలో ఉంటుందో అని అప్పుడే ఊహాగానాలు మొదలైపోయాయి.కొందరైతే ఈ యుద్ధ సన్నివేశాలు బాహుబలి క్లైమాక్స్ ని తలదన్నేలా ఉంటుందని చర్చించుకుంటున్నారు.