బాలయ్య 101, 102, 103 క్లియర్ గా క్లారిటీగా అవే!

నందమూరి నట సింహం బాలయ్య వేసిన ప్లాన్ చూస్తుంటే మిగతా స్టార్ హీరోల దిమ్మ తిరిగి పోతుంది.. ఎంతో ప్రతిష్టాత్మకంగా వందవ సినిమా ఉండాలని అందరి దర్శకులకు ఓపెన్ ఆఫర్ ఇచ్చిన బాలకృష్ణ. గౌతమిపుత్ర శాతకర్ణి కథతో చరిత్రలో మిగిలిపోయే సినిమాగా తీర్చిదిద్దుతున్నాడు. అయితే ఇక తనకు కథ చెప్పిన మిగతా దర్శకులతో కూడా బాలయ్య వరుస సినిమాలు ప్లాన్ చేస్తున్నాడు.

అనుకున్నట్టుగానే బాలయ్య వందవ సినిమాకు రకరకాల సబ్జెక్ట్స్ టేబుల్ మీదకు వచ్చాయి. అయితే ఫైనల్ గా క్రిష్ కు ఓకే చెప్పి గౌతమీ పుత్ర శాతకర్ణికి చరిత్రలో మిగిలిపోవాలని చూస్తున్నాడు. ఇక తన101 సినిమాగా బాలయ్య కృష్ణవంశీ రైతు కథతో రాబోతున్నాడని ఇప్పటికే ఎనౌన్స్ చేశాడు కూడా. ఇక ఆ తర్వాత మరలా తనకు సింహా, లెజెండ్ లాంటి హిట్స్ ఇచ్చిన బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా ప్లాన్ చేస్తున్నాడట.

బాలయ్య,బోయపాటి కాంబోలో రెండు సూపర్ హిట్స్ వచ్చాయి.ఈ కాంబినేషన్ లో మూడో సినిమా అంచనాలకు మించి ఉంటుందని అంటున్నారు. ఇక రెండు సినిమాల అనుభవం ఉన్న కొత్త దర్శకుడు అనీల్ రావిపూడి కూడా బాలయ్య బాబుకి ఓ పవర్ ఫుల్ పోలీస్ కథ చెప్పిన సంగతి తెలిసిందే. ఆ సినిమాకు టైటిల్ గా ‘రామారావు గారు’ అని కూడా పెట్టేశారు.

సో బాలయ్య 101, 102, 103 సినిమాలు దాదాపు కన్ఫాం అన్నట్టే. వంద కొట్టడమే లేటు ఇక మిగతా సినిమాలన్ని చక చకా కానిచ్చేస్తానంటున్నాడు బాలకృష్ణ. ఇక ప్రస్తుతం చేస్తున్న గౌతమిపుత్ర శాతకర్ణి మూవీ రెండు షెడ్యూల్ పూర్తి చేసుకుని క్లైమాక్స్ షూట్ కూడా ఆల్మోస్ట్ పూర్తి చేసుకోబోతోంది. జార్జియాలో1000 మంది సైనికులతో జరుగుతున్న ఈ యుద్ధం సినిమాకే హైలెట్ గా నిలుస్తుందని అంటున్నారు.