బాబూ నీ ఇల్లు కూల్చేస్తాం ..వైసీపీ ఎమ్మెల్యే ప్రకటన

June 26, 2019 at 12:02 pm

ఏపీ మాజీ సీఎం చంద్ర‌బాబుకు మంగ‌ళ‌గిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అదిరిపోయే కాంప్లిమెంట్ ఇచ్చారు. ప్ర‌స్తుతం హాట్‌హాట్‌గా సాగుతున్న ప్ర‌జావేదిక కూల్చివేత నేప‌థ్యంలో స్థానిక ఎమ్మెల్యేగా ఉన్న ఆళ్ల‌.. చాలా ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చే శారు. చ‌ట్టాల‌ను, నిబంధ‌న‌ల‌ను తుంగ‌లోకి తొక్కిన చంద్ర‌బాబు.. ప్ర‌జ‌ల‌కు ఏమ‌నిస మాధానం చెబుతార‌ని వ్యాఖ్యానిం చారు. ఇప్ప‌టికైనా మ‌ర్యాద‌గా త‌న నివాసం నుంచి ఆయ‌న త‌ప్పుకొంటే మంచిద‌ని, లేక‌పోతే.. కోర్టుకు వెళ్ల‌యినా స‌రే తా ము బాబును ఖాళీ చేయిస్తామ‌ని వెల్ల‌డించారు.

ఈ ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే.. రాబోయే రోజుల్లో చంద్ర‌బాబు ఉచ్చు బిగుసుకునే ప్ర‌మాదం పొంచి ఉంద‌ని స్ప‌ష్టంగా తెలుస్తోంది. వాస్త‌వానికి ప్ర‌జావేదిక నిర్మాణం కూల్చివేత‌ను రాజ‌కీయం చేయాల‌ని చంద్ర‌బాబు అండ్ టీం భారీ ఎత్తున నిర్ణ‌యించా యి. ఈ క్ర‌మంలోనే ప్ర‌జావేదిక కూల్చివేత ప‌నులు ప్రారంభం అయిన వెంట‌నే ఓ వ్య‌క్తి ద్వారా హైకోర్టులో హౌస్ మోష‌న్ పిటిష‌న్‌ను దాఖ‌లు చేయించారు. దీనిపై అర్ధ‌రాత్రి 2 త‌ర్వాత విచారించిన కోర్టు.. స్టే ఇచ్చేందుకు, ప్ర‌భుత్వాన్ని మంద‌లించేందుకు కూడా స‌సేమిరా అన‌డంతో త‌మ్ముళ్ల ప్లాన్ ఆదిలోనే నేల‌మ‌ట్ట‌మైంది.

లేకుంటే.. ఇప్ప‌టికి ప్ర‌జావేదిక విష‌యాన్ని గ‌గ్గోలు పుట్టించేవారు. అయినా.. ఈ విష‌యంలో చంద్ర‌బాబుమాట్లాడేందుకు ఏముంటుంది? అంటున్నారు మేధావులు. తాను సీఎంగా ఉన్న‌ప్పుడు చ‌ట్టాల‌ను, నిబంధ‌న‌ల‌ను ప‌రిర‌క్షించాల్సిన చంద్ర‌బాబు.. వాటిని తుంగ‌లో తొక్క‌డాన్ని సీరియ‌స్‌గానే ప‌రిగ‌ణిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో ఎక్క‌డా కూడా మేధావులు కూడా మాట్లాడడం లేదు.

ప్ర‌జాధ‌నం దుర్వినియోగం చేస్తున్నాడ‌ని జ‌గ‌న్‌ను ఆడిపోసుకుంటున్న టీడీపీ నాయ‌కులు.. నిబంధ‌న‌ల‌ను ప‌క్క‌న పెట్టి ప్ర‌జావేదిక నిర్మాణం జ‌రిపిన‌ప్పుడు, రూ.5 కోట్ల నిర్మాణ వ్య‌యాన్ని రూ.8.5 కోట్ల‌కు పెంచిన‌ప్పుడే ప్ర‌జాధ‌నం దుర్వినియోగం అయింద‌ని, ఈ నిర్మాణం ఎప్ప‌టికైనా కూలిపోక త‌ప్ప‌ద‌ని తెలియ‌దా? ఇప్పుడు కొత్త‌గా కేక‌లు పెట్టే బ‌దులు.. భ‌విష్య‌త్తులో అయినా స‌క్ర‌మంగా ఉంటే.. మంచిద‌ని ఆళ్ల వంటి వారు సూచిస్తున్నారు.

బాబూ నీ ఇల్లు కూల్చేస్తాం ..వైసీపీ ఎమ్మెల్యే ప్రకటన
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share