ప్రేమలో ప‌డ్డ అమ‌ల‌..!

July 15, 2019 at 11:47 am

మొద‌టిదే మోక్షం అంటారు కొంద‌రు పెద్ద‌లు… కానీ మారుతున్న కాలానికి అనుగుణంగా మారుతున్నారు మ‌నుషులు. అందుకే మొద‌టిదైతేందీ… చివ‌రిదైతేందీ… మ‌జా ఉండాలే నంటున్నారు ఈత‌రం మనుషులు. అందుకేనేమో ఒక్క కొంద‌రు పెండ్ల‌ళ్ళ విష‌యంలోనూ ఇలాగే వ్య‌వ‌హ‌రిస్తున్నారు. కొంద‌రు తార‌లు పెండ్లి చేసుకుని సుఖంగా కాపురం చేసుకుంటుంటే కొంద‌రు మాత్రం కాపురం గీపురం జాంత‌నై… భ‌ర్తోద్దు… బందాలొద్దు… అంటూ క‌ట్టుకున్న మొగ‌నితో క‌టీఫ్ అంటున్నారు… ఈ వరుస‌లోనే ఉంది న‌టి అమ‌లపాల్‌…

ఇంత‌కు విష‌యం ఏంటంటే… ఇటీవ‌ల ఒంట‌పై నూలు పోగు లేకుండా ఆమే సినిమాలో న‌టించిన అమ‌లాపాల్ ఇప్పుడు ప్రేమ‌లో ప‌డింద‌ట‌. ఇంత‌కు ఎవ‌రితో ప‌డిందంటే అదంతా ఇప్పుడెందుకు అంటుంద‌ట అమ్మ‌డు. అమ‌లాపాల్ కోలీవుడ్లో స్టార్ తారగా ఉన్న టైంలో ద‌ర్శ‌కుడు విజ‌య్‌ను పెండ్లి చేసుకుంది. అయితే విజ‌య్ తో కొన్నాళ్ళు కాపురం చేసిన అమ్మ‌డు మ‌ళ్ళీ సినిమాల‌పై మ‌న‌స్సు మ‌ళ్ళీ హీరోయిన్‌గా న‌టించింది. అప్ప‌టి నుంచి విజ‌య్‌పై మ‌న‌స్సు మొత్తింద‌ట‌.

విజ‌య్‌ను కాదంది… ఇంకేముంది విడాకులు ఇచ్చింది… ఒంట‌రిగా బ‌తుకుతుంది… ఇక త‌న‌కు ఎదురులేదు క‌దా.. ఒంటిపై బ‌ట్ట‌లు లేకుండా న‌టించేస్తోంది. అయితే ఈ స‌మ‌యంలోనే అమ‌లాపాల్ ఉత్త‌గ‌నే లేద‌ట‌. ఓ మ‌నిషిని పీక‌ల్లోతు ప్రేమిస్తోంద‌ట‌. ఇంత‌కు ఎవ‌ర‌త‌ను అంటే ఇప్పుడే ఎందుకు అత‌గాడు సినిమా మ‌నిషి మాత్రం కాదు అంటుంది. అంటే ఏదో బిజినెస్ మెన్ అయి ఉంటాడా… లేక ఏదైనా క్రీడాకారుడా అనేది తేలాల్సి ఉంది. అయితే అమ‌ల‌పాల్ మొదటి భ‌ర్త విజ‌య్ మాత్రం ఇటీవ‌లే పెళ్ళీ పీట‌లెక్కాడు… సో ఈ అమ్మ‌డు ఎప్పుడు పెళ్ళీ పీట‌లెక్కుతుందో చూడాలి మ‌రి.

ప్రేమలో ప‌డ్డ అమ‌ల‌..!
0 votes, 0.00 avg. rating (0% score)

comments



Share
Share