చంద్ర‌బాబుకు మ‌రో షాక్‌.. బీజేపీలోకి మ‌రో కీల‌క నేత‌..!

June 24, 2019 at 12:55 pm

`ప్ర‌స్తుతం విదేశాల్లో ఉన్న చంద్ర‌బాబు.. దేశానికి తిరిగి రాగానే మంచి గిఫ్ట్ ఇస్తాం“ అని ప్ర‌క‌టించిన బీజేపీ .. అనుకు న్నంత ప‌నీ చేస్తున్న‌ట్టు స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. ఇప్ప‌టికే న‌లుగురు రాజ్య‌స‌భ స‌భ్యుల‌ను త‌న పార్టీలోకి విలీనం చేసుకు న్న బీజేపీ… ఇప్పుడు మ‌రింత మందిపై దృష్టి పెట్టింది. ఎమ్మెల్యేలు కూడా త‌మ‌తో ట‌చ్‌లో ఉన్నార‌ని చెబుతున్న బీజేపీ నాయ‌కులు.. టీడీపీలో బ‌లంగా ఉన్న కొంద‌రు నాయ‌కుల‌ను ముందుగా పార్టీలోకి చేర్చుకునేందుకు సిద్ధ‌మ‌య్యారు. ఈ క్ర‌మంలోనే తాజాగా మ‌రో పేరు తెర‌మీదికి వ‌స్తోంది.

ఒక‌ప‌క్క ఎన్నిక‌ల్లో ఘోర ప‌రాజ‌యం, మ‌రోప‌క్క‌, అధికార పార్టీ నుంచి ఎదుర‌వుతున్న అవ‌మానాలు, కార్య‌క‌ర్త‌ల‌పై దాడుల‌ను త‌ట్టుకుని నిల‌బ‌డుతున్నాం.. స‌మీక్షించుకుంటున్నాం.. అనుకునే స‌రికి.. న‌లుగురు రాజ్య‌స‌భ స‌భ్యులు, అందునా.. చంద్ర‌బాబుకు అత్యంత స‌న్నిహితులైన వారు పార్టీ మారిపోయారు. దీంతో టీడీపీకి భారీ దెబ్బ‌త‌గిలింది. ఇంత‌లోనే జ‌గ‌న్ ప్ర‌భుత్వం ప్ర‌జావేదికను కూల్చేసేందుకు ఆదేశాలు జారీ చేసింది.

ఇవ‌న్నీ ఒక ఎత్తు.. ఇప్పుడు మ‌రోసారి పార్టీలోంచి జంపింగ్‌ల అంశం తెర‌మీదికి రావ‌డంతో పార్టీలో భారీ ఎత్తున క‌ల‌క‌లం ప్రారంభ‌మైంది. తాజాగా, పార్టీ సీనియ‌ర్ నేత‌, ప్ర‌ముఖ సినీ నిర్మాత అంబికా కృష్ణ త్వ‌ర‌లోనే టీడీపీకి బై చెప్పి.. బీజేపీ తీర్థం పుచ్చుకు నేందుకు సిద్ధ‌మ‌వుతున్న‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. వాస్త‌వానికి అంబికాకృష్ణ‌కు చంద్ర‌బాబు ఎన‌లేని గౌర‌వం ఇచ్చారు. రాష్ట్ర ఫిలిం డెవ‌ల‌ప్‌మెంట్ బోర్డ్ చైర్మ‌న్‌గా ఆయ‌న‌ను నియ‌మించి, కేబినెట్ హోదాను సైతం క‌ట్ట‌బెట్టింది.

తాజా స‌మాచారం ప్ర‌కారం.. ఆయన సోమవారం రాత్రికే ఢిల్లీ కి వెళ్లి.. అక్క‌డ బీజేపీ పెద్ద‌ల‌తో భేటీ అయి.. రేపు బీజేపీ కండువా క‌ప్పుకొంటున్న‌ట్టు తెలిసింది. ఎన్టీఆర్ హ‌యాంలో టీడీపీకి అంబికా కృష్ణ వెన్నెముక‌గా ప‌నిచేశారు. సినిమా రంగానికి టీడీపీని చేరువ చేయ‌డంలో స‌క్సెస్ అయ్యారు. ఎన్నిక‌ల‌కు ముందు దివ్య‌వాణిని పార్టీలోకి తీసుకు వ‌చ్చింది అంబికానే. సో.. ఇప్పుడు ఆయ‌న జంప్ అవుతుండ‌డంతో చంద్ర‌బాబుకు, టీడీపీకి టాలీవుడ్ కూడా దూర‌మ‌య్యే ప‌రిస్థితి ఉంద‌ని స‌మాచారం. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

చంద్ర‌బాబుకు మ‌రో షాక్‌.. బీజేపీలోకి మ‌రో కీల‌క నేత‌..!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share