ఏపీ ఎమ్మెల్యేలపై వర్మ సెటైర్లు

June 18, 2019 at 4:49 pm

సోష‌ల్ మీడియాను వేదిక‌గా చేసుకుని సంచ‌ల‌న విమ‌ర్శ‌ల‌కు పాల్ప‌డే విల‌క్ష‌ణ సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు రామ్‌గోపాల్ వ‌ర్మ ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఎమ్మేల్యేల‌పై సంచ‌ల‌న విమర్శ‌లు చేశారు. రామ్‌గోపాల్ వ‌ర్మ త‌న ట్విట్ట‌ర్‌లో ఏపీ ఎమ్మేల్యేల ప‌నితీరుపై సెటైర్లు వేశారు. రామ్‌గోపాల్ వ‌ర్మ సెటైర్లు నెట్టింట్లో హ‌ల్‌ఛ‌ల్ చేస్తున్నాయి.

ఏపీ ఎమ్మేల్యేల‌పై రామ్‌గోపాల్ వ‌ర్మ వ్యంగాస్త్రాలు సంధించడం ఇప్పుడు ఏపీలో సంచ‌ల‌నం క‌లిగిస్తున్నాయి. ఎమ్మెల్యేల‌నే కాదు ఏకంగా స్పీక‌ర్ ప‌నితీరుపైనా విమ‌ర్శ‌లు చేయ‌డం విశేషం. అసెంబ్లీలో గంట మోగించ‌డం త‌ప్ప స్పీక‌ర్ చేస్తోన్న ప‌ని ఇంకేమైనా ఉందా…? జ‌స్ట్ ఆస్కింగ్ అంటూ ట్వీట్లు చేయ‌డం మొద‌లు పెట్టాడు. అంటూ ప్ర‌శ్నించాడు. స్పీక‌ర్ గంట మోగిస్తుంటే త‌న‌కు స్కూల్ బెల్ గుర్తుకొస్తుంద‌ని, ఎందుకంటే ఎమ్మెల్యేల ప్ర‌వ‌ర్త‌న స్కూల్ పిల్ల‌ల మాదిరి ఉంద‌ని కామెంట్ చేశాడు.

అసెంబ్లీలో స‌న్నివేశాలు ఒక‌రిపై ఒక‌రు అరుచుకోవ‌డం, ఒక‌రినొక‌రు బెదిరించుకోవడం, గ‌తం గురించి ఫిర్యాదులు చేయ‌డం కోస‌మా…? ప్ర‌జాస‌మ‌స్య‌లు చ‌ర్చించ‌డం కోస‌మా..? ప‌్ర‌జాస‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించ‌డం కోస‌మా…? జ‌స్ట్ ఆస్కింగ్ అంటూ ట్వీట్లు చేశారు. రామ్‌గోపాల్ వ‌ర్మ ట్వీట్లు ఇప్పుడు సంచ‌ల‌నంగా మారాయి.

ఏపీ ఎమ్మెల్యేలపై వర్మ సెటైర్లు
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share