ఏపీ స‌ర్వేల‌పై కొత్త ట్విస్ట్‌..!!

May 20, 2019 at 10:40 am

ఏపీలో జ‌రిగిన ఎన్నిక‌లు ట్విస్టుల‌పై ట్విస్టులు ఇస్తున్నాయి. ఎన్నిక‌ల అనంత‌ర ప‌రిణామాలు, దీనికి ముందున్న ప‌రిణా మాలు రాజ‌కీయ నాయ‌కుల‌కు ట్విస్టుల‌పై ట్విస్టులు ఇచ్చాయి. వైసీపీ, టీడీపీ మ‌ధ్య హోరా హోరీగా సాగిన ఎన్నిక‌ల పోరులో ఎవ‌రు గెలుస్తార‌నేది అత్యంత ఆస‌క్తిక‌ర విష‌యం. ముఖ్యంగా చంద్ర‌బాబు తిరిగి అధికారంలోకి రావాల‌ని చేసిన ప్ర‌య‌త్నాల్లో ప‌సుపు-కుంకుమ హైలెట్. ఈ విష‌యాన్ని ఆ పార్టీ నాయ‌కులే ఒప్పుకొన్నారు. వైసీపీ విష‌యానికి వ‌స్తే.. మా ర్పు జ‌పంతో ముందుకు సాగింది. మ‌రి ఈ రెండు పార్టీల విష‌యంలో ప్ర‌జ‌లు దేనికి మొగ్గారు? అనే మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌. ఈ ప్ర‌శ్న‌కు సమాధానంగా ఎన్నిక‌ల అనంత‌రం విడుద‌ల‌య్యే ఎగ్జిట్ పోల్స్ సర్వేపై ఆస‌క్తి పెరుగుతుంది.

సాధార‌ణంగా గ‌డిచిన రెండున్న‌ర ద‌శాబ్దాలుగా ఈ ఎగ్జిట్ పోల్స్ స‌ర్వే దేశంలో కొన‌సాగుతోంది. ఇక, గ‌డిచిన 15 సంవ‌త్స రాలుగా ఇది మ‌రింత‌గా పెరిగింది. స‌ర్వే సంస్థ‌లు కూడా భారీగా పెరిగాయి. వ్య‌క్తిగ‌త స‌ర్వేల‌కు కూడా ప్రాధాన్యం పెరిగిం ది. ఈ క్ర‌మంలోనే ఏపీ ఎన్నిక‌ల ప‌ల్స్‌పై తాజాగా స‌ర్వే రిజ‌ల్ట్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. దీంతో ఇప్ప‌టి వ‌ర‌కు కొన‌సాగిన స‌స్పెన్స్‌కు, న‌రాలు తెగే ఉత్కంఠ‌కు, సీఎం ఎవ‌ర‌వుతారు? అనే విష‌యానికి తెర‌ప‌డుతుంద‌ని అంద‌రూ భావించారు. అయితే, దాదాపు 10కి పైగా సంస్థ‌లు వెల్ల‌డించిన స‌ర్వే రిజ‌ల్ట్ మాత్రం ఏపీ రాజ‌కీయ‌నేత‌లు స‌హా సాధార‌ణ పౌరుడిని మ‌రింత ఉత్కంఠ‌లోకి నెట్టేశాయి.

మొత్తం స‌ర్వే సంస్థ‌ల ఫ‌లితాలు కూడా రెండుగా విడిపోయిన‌ట్టుగా క‌నిపించింది. స్థానికంగా తెలుగు రాష్ట్రాల‌కు చెందిన వ్య‌క్తులు, సంస్థ‌లు చేసిన స‌ర్వేలో చంద్ర‌బాబుకు ఆయ‌న పార్టీ టీడీపీకి ప‌ట్టం క‌ట్టారు. ఇక‌, జాతీయ‌స్థాయిలో ఉన్న ఎన్డీటీవీ, ఆజ్‌త‌క్, సీపీఎస్‌ వంటివి మాత్రం జ‌గ‌న్‌ను హైలెట్ చేసాయి. ఏపీ ఫ‌లితాల‌పై ఆర్‌జీ ఫ్లాష్‌టీం చేసే సర్వే ఫలితాల కోసం ప్రజలు, నాయ‌కులు కూడా ఉత్కంఠ‌గా ఎదురు చూశారు. ఈ ఎన్నికల్లో ఏపీ ప్రజలు మళ్లీ సైకిలే ఎక్కబోతున్నారని ఒక రోజు ముందే సంకేతమిచ్చిన మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌ ఆదివారం ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాల్లో ఆ విషయాన్ని ఖరారు చేశారు. టీడీపీకి 90 నుంచి 110 వరకు అసెంబ్లీ స్థానాలు, 13 నుంచి 17 వరకు లోక్‌సభ స్థానాలు వస్తాయని ఆయన తెలిపారు.

అదేవిధంగా ఒక‌రోజు ముందుగానే నాడిని వెల్ల‌డించిన టీవీ-5, ఆంధ్ర‌జ్య‌తి సంస్థ‌లు కూడా బాబుకు ప‌ట్టం క‌ట్టాయి. ఇక‌, ఇంగ్లీష్‌ టీవీ ఛానళ్లు, సర్వే సంస్థల్లో, ఇండియా టుడే, సీపీఎస్‌ సర్వే, వీడీపీ అసోసియేట్స్‌ వంటివి వైసీపీకి వందకుపైగా అసెంబ్లీ స్థానాలు వస్తాయని తెలిపాయి. ఈ మొత్తం స‌ర్వేల సారాంశంలో ఎక్క‌డా రాష్ట్రంలో హంగ్ వ‌స్తుంద‌ని కానీ, మూడో పార్టీగా అవ‌త‌రించి, డైలాగుల‌తో దంచి కొట్టిన ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ నేతృత్వంలో జ‌న‌సేన‌కు ఎక్క‌డా రెండు సీట్లు కూడా వ‌స్తాయ‌ని చెప్పిన ప‌రిస్థితి క‌నిపించక‌పోవ‌డం గ‌మ‌నార్హం. మొత్తంగా జ‌న‌సేనను డోలాయ‌మానంలో ప‌డేసి, వైసీపీ, టీడీపీల్లో ఆశ‌, నిరాశ‌ల‌ను అమాంతం పెంచేసిన ఈ స‌ర్వే ఫ‌లితాలు ఏమేర‌కు నిజ‌మ‌వుతాయ‌నేది 23న కానీ తెలియ‌దు.

ఏపీ స‌ర్వేల‌పై కొత్త ట్విస్ట్‌..!!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share