అయ్య‌న్న‌కు `పాపా`ల ఎఫెక్ట్‌.. ఏం జ‌రిగిందంటే..!

May 1, 2019 at 3:07 pm

చేసిన పాపం చెబితే పోతుంద‌ని అంటారు. అయితే, రాజ‌కీయాల్లో మాత్రం అది కుద‌ర‌ద‌ని అంటున్నారు నాయ‌కులు. చే సిన పాపాలు చేసేసి చేతులు క‌డిగేసుకుంటే.. స‌రిపోతుందా? అని ప్ర‌శ్నిస్తున్నారు. ఇప్పుడు ఈ ప్ర‌శ్న‌లు మంత్రి అయ్య న్న‌పాత్రుడుకు నిద్ర ప‌ట్ట‌నివ్వ‌డం లేదు. విశాఖ జిల్లా న‌ర్సీప‌ట్నం నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేసిన అయ్య‌న్నకు నిద్ర లేని రాత్రులు గ‌డుస్తున్నాయ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. టీడీపీ పార్టీ ఆవిర్భావం నుంచి ఈ పార్టీనే అంటిపెట్టుకుని ఉన్న అయ్య‌న్న 1983లోనే న‌ర్సీప‌ట్నం నుంచి టీడీపీ టికెట్‌పై విజ‌యం సాధించారు. ప‌లు మార్లు ఓడినా.. అంత‌కు మించిన సార్లు గెలిచినా కూడా ఆయ‌న పార్టీని విడిచి పెట్ట‌కుండా నిబ‌ద్ధ‌త‌తో ప‌నిచేస్తున్నారు.

అయితే, 2009లో ఇక్క‌డ వ‌చ్చిన రాజ‌కీయ కుదుపు ఒక్క‌సారిగా ఆయ‌న‌ను ఇబ్బందిలోకి నెట్టింది. ఇక్క‌డ నుంచి 2009 ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ త‌ర‌ఫున పోటీ చేసి బోళెం ముత్యాల పాప విజ‌యం సాధించారు. త‌ర్వాత మారిన రాజ‌కీయ స‌మీక‌ర ణల నేప‌థ్యంలో ఆమె టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. అయితే, త‌న‌కు ఎక్క‌డ పోటీ వ‌స్తుందో అని భావించిన అయ్య‌న్న ఆమెను సూటిపోటి మాట‌ల‌తో విమ‌ర్శించారు. పార్టీ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చే వ‌ర‌కు నిద్ర పోకుండా విమ‌ర్శ‌లు చేస్తూనే ఉన్నారు. అయితే, బ‌ల‌మైన నాయ‌కురాలిగా గుర్తింపు సాధించ‌డంతో ప‌లుమార్లు చంద్ర‌బాబు కూడా వీరిద్ద‌రి మ‌ధ్య స‌యోధ్య చేసేందుకు ప్ర‌య‌త్నించారు. కానీ, అయ్య‌న్న మాత్రం స‌సేమిరా అన్నారు.

ఇక‌, తాజా ఎన్నిక‌ల్లో పోటీ తీవ్రంగా ఉండ‌డం, త‌న గెల‌పుపై త‌న‌కే న‌మ్మ‌కం లేక పోవ‌డంతో ఇక‌, త‌ప్పని ప‌రిస్థితిలో అయ్య‌న్నే నేరుగా పాప‌ను బ‌జ్జ‌గించేందుకు రంగంలోకి దిగారు. స్వ‌యంగా ఆయ‌నే ఎన్నిక‌లకు ముందు పాప ఇంటికి వెళ్లి.. త‌న‌కు సోపోర్టు చేయాల‌ని, పాత విష‌యాలు మ‌న‌సులో పెట్టుకోవ‌ద్ద‌ని కోరారు. దీనికి ఆమె అంగీక‌రించింది. సాయం చేస్తాన‌ని కూడా మాట ఇచ్చింది. ఈ నేప‌థ్యంలో ఓ ఫైన్ డే.. నేరుగా వ‌చ్చి చంద్ర‌బాబును క‌లుసుకుని పార్టీ కండువా క‌ప్పుకొంది. పార్టీలోకి రావ‌డ‌మైతే వ‌చ్చినా.. మ‌న‌సులో మాత్రం ఆమె అయ్య‌న్న పై ఉన్న కోపాన్ని త‌గ్గించుకోలేక పోయారు. పైగా కుటుంబంలోనూ అయ్య‌న్న‌కు సాయం చేయ‌డంపై విభేదాలు వ‌చ్చాయి. దీంతో లోపాయికారీగా ఆమె వైసీపీ అభ్య‌ర్థికి మ‌ద్ద‌తు ప్ర‌క‌టించారు. టీడీపీ ప్ర‌చారానికి దూరంగా ఉన్నారు. ఒక‌టి రెండు ప్ర‌చార కార్య‌క్ర‌మాల‌కు వ‌చ్చినా.. పెద్ద‌గా మాట్లాడ‌కుండానే ఇంటి ముఖం ప‌ట్టారు. ఇప్ప‌డు అయ్య‌న్నను ఈ ప‌రిస్థితే వేధిస్తోంది. పాప దెబ్బ బాగానే త‌గులుతుంద‌ని ఆయ‌న భ‌య‌ప‌డుతున్నార‌ట‌. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

అయ్య‌న్న‌కు `పాపా`ల ఎఫెక్ట్‌.. ఏం జ‌రిగిందంటే..!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share