గెలుపుపై బాలయ్య సంచలన వ్యాఖ్యలు

April 4, 2019 at 11:33 am

సినీ నటుడు, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు ఓట‌మి భ‌యం ప‌ట్టుకుంది. ఈ ఎన్నిక‌ల్లో గెల‌వ‌డ‌మే క‌ష్టంగా ఉంద‌నే విష‌యం ఆయ‌న‌కు అర్థ‌మైంది. దీంతో ప్ర‌చార స‌మ‌యంలో ఆయ‌ర తీవ్ర అస‌హ‌నంతో ఊగిపోతున్నారు. ఈ అస‌హ‌నాన్ని సొంత పార్టీ కార్యకర్తలపైనే చూపుతున్నారు. తాజాగా అనంతపురం జిల్లా హిందూపురంలో ఎన్నికల ప్రచారంలో ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు తీవ్ర క‌ల‌క‌లం రేపుతున్నాయి. ఈ సందర్భంగా బాలయ్య త‌న నోటి దురుసుత‌నాన్ని మరోసారిబయటపెట్టారు. ఈసారి సొంత కార్యకర్తలపైనే విరుచుకుపడ్డారు.

హిందూపురం నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా త‌న‌ భార్య వసుంధరతో కలిసి బాలకృష్ణ ఎన్నికల ప్రచార రథంపై వెళుతుండగా ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది. ఓ కార్యకర్త ఈ ఎన్నికల్లో మీకు వేలల్లో మెజారిటీ వస్తుందంటూ బాగా అరిచాడు. మరో కార్యకర్త కూడా బాలయ్య ఈసారి 60 వేల మెజారిటీ అంటూ నినాదాలు చేశాడు. దీంతో బాల‌య్య మ‌రోసారి త‌న అస‌హ‌నాన్ని వెల్ల‌గ‌క్కాడు. అస‌లు గెల‌వ‌డ‌మే క‌ష్టంగా ఉందని, వేలు లక్షల మెజారిటీ అంటూ త‌న‌ను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిప‌డ్డారు.

ఈ సంద‌ర్భంగా హైప్ క్రియేట్ చేసేవారి పీక కొయ్యాలంటూ పక్కనే ఉన్న వసుంధరతో బాల‌య్య అన్నారు. మరో కార్యకర్త సర్‌ 60 వేలు, 70 వేలు మెజారిటీ వ‌స్తుంది అంటూ అరిచాడు. దీంతో బాల‌య్య రెచ్చిపోయారు. `అరే, నీ పేరు అడ్రస్‌ చెప్పరా.. గెలవకపోతే నీ సంగతి చెబుతా.. పీక కోస్తా.. నాకొడకా.. ఏసీపాడదొబ్బుతా` అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించి వీడియో ఇప్పుడు సోష‌ల్‌మీడియాలో వైరల్‌ అవుతోంది. బాలకృష్ణ చేష్టలపై హిందూపురం ప్రజలు మండిప‌డుతున్నారు.

గెలుపుపై బాలయ్య సంచలన వ్యాఖ్యలు
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share