బాలయ్యపై అన్ని సర్వేలది ఒకటే రిపోర్ట్ !

May 22, 2019 at 2:55 pm

న‌ట‌సింహం బాల‌కృష్ణ రాజ‌కీయాల్లో ఈ సారి ఓట‌మి త‌ప్ప‌ద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అంచ‌నా వేస్తున్నారు. టీడీపీకి కంచుకోట‌గా ఉండే హిందూపురం నియోజ‌క‌వ‌ర్గం నుంచి గ‌త ఎన్నిక‌ల్లో గెలిచినా ఆయ‌న ఈసారి మాత్రం తీవ్ర పోటీని ఎదుర్కొన్నారు. గ‌త ఎన్నిక‌ల్లో గెలిచిన ఆయ‌న సినిమాల‌తో బిజిగా ఉండి రాజ‌కీయంగా నియోజ‌క‌వ‌ర్గంలో ప్ర‌జ‌ల‌తో క‌ల‌సిపోలేక‌పోయారు. ఆయ‌న నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల‌కు అందుబాటులో లేక‌పోవ‌డం…కేవ‌లం కొంత‌మంది నాయ‌కుల‌పై ఆధార‌ప‌డి పాల‌న సాగించారు. అన్నీంటికి బావ ఉన్నాడులే…ఆయ‌నే చూసుకుంటాడులే అన్న ధోర‌ణిని క‌న‌బ‌ర్చాడు.

అయితే గ‌త ఐదేళ్ల‌కాలంలో ఆయ‌న నియోజ‌క‌వ‌ర్గ అభివృద్ధికి చేసిందేమీ లేద‌నే విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి. ఎన్నిక‌ల‌కు ముందు ఆయ‌న హిందూపురం నుంచి కాకుండా మ‌రోస్థానం నుంచి పోటీ చేస్తార‌నే వాద‌న బ‌లంగా వినిపించింది. కొంత‌మంది టీడీపీ నేత‌లు కూడా ఆయ‌న్ను వారించిన‌ట్లు వార్త‌లు వ‌చ్చాయి. అయితే బాల‌కృష్ణ మాత్రం హిందూపురం నుంచే బ‌రిలోకి దిగారు. చంద్ర‌బాబు, ఎన్టీఆర్ ప్ర‌భంజ‌నం గురించే ఆయ‌న ప్ర‌చారంలో అడ‌గ‌డుగునా వ‌ల్లెవేస్తూ వెళ్లారు. తాను ఐదేళ్లలో చేసిన అభివృద్ధిని ఎక్క‌డా ప్ర‌స్తావ‌న రాకుండా చూసుకున్నారు. ఎందుకంటే ఆయ‌న చేసిందేమీ లేదు క‌నుకే అలా చేశార‌ని విమ‌ర్శ‌లు వ్య‌క్త‌మ‌య్యాయి.

ఇక ఇటీవ‌ల ప‌లు జాతీయ మీడియా సంస్థ‌ల‌తో పాలు ప‌లు స‌ర్వే సంస్థ‌లు టీడీపీకి చేదు అనుభ‌వం త‌ప్పద‌ని ఎగ్జిట్‌పోల్స్‌ను విడుద‌ల చేశాయి. టీడీపీ ఓడిపోయే స్థానాల జాబితాలో న‌ట‌సింహం బాల‌కృష్ణ పోటీ చేసిన హిందూపురం కూడా ఉన్న‌ట్లు చ‌ర్చ జ‌రుగుతోంది. బాల‌య్య గెలిస్తే త‌మ‌కు మిగిలేదీ శూన్య‌మేన‌ని భావించిన ఓట‌ర్లు వైసీపీ వైపు మొగ్గుచూపార‌నే వాద‌న వినిపిస్తోంది. ఇక టీడీపీ నేత‌లు కూడా ఆఫ్ ది రికార్డులో బాల‌య్య ఓట‌మి పాల‌వుతాడ‌నే విష‌యాన్ని అంగీక‌రిస్తున్నార‌ట‌.
ఎన్నిక‌ల‌కు కొద్ది రోజుల ముందు కూడా నియోజ‌క‌వ‌ర్గ స్థాయి నేత‌లు పార్టీ మార‌డం వెనుక అస‌లు విష‌యం ఇదేన‌ని గుర్తు చేస్తున్నారు.

బాలయ్యపై అన్ని సర్వేలది ఒకటే రిపోర్ట్ !
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share